షాక్: క్యాబ్‌లోనే మహిళపై అత్యాచారం, దోపిడి

Posted By:
Subscribe to Oneindia Telugu

ముంబై: మహరాష్ట్రలో 32 ఏళ్ళ యువతిపై దోపిడి, అత్యాచారానికి పాల్పడిన క్యాబ్ డ్రైవర్, అతని స్నేహితుడిని మహరాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. మహిళ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.

భర్త సహయంతో నవవధువుపై గ్యాంగ్‌రేప్: వీడియో తీసి, ట్రిపుల్ తలాక్

షాక్: మరో డేరా బాబా, 40 మంది బాలికలకు విముక్తి,, లైంగిక దాడులు

మహరాష్ట్రలో క్యాబ్ లో గమ్యస్థానానికి వెళ్ళాలని భావించిన మహిళకు ఆ క్యాబే ప్రమాదానికి కారణంగా మారింది. క్యాబ్ డ్రైవర్ ,అతని స్నేహితుడు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి వద్ద ఉన్నడబ్బులు లాక్కొన్నారు.

నిందితులను ఐదు రోజుల్లోనే పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలు ఇచ్చిన పిర్యాదు మేరకు పోలీసులు నిర్వహించిన దర్యాప్తులో నిందితులు వాస్తవాలను ఒప్పుకొన్నారు.

క్యాబ్‌లో మహిళపై లైంగిక దాడి

క్యాబ్‌లో మహిళపై లైంగిక దాడి

మహరాష్ట్రంలోని థానే జిల్లాలో 32 ఏళ్ళ యువతిపై దోపిడి, అత్యాచారానికి క్యాబ్ డ్రైవర్, అతని స్నేహితుడు పాల్పడ్డాడు. ఈ నెల 19వ, తేదిన కషిమిరా నుంచి థానేకు ఓ మహిళ క్యాబ్ లో ప్రయాణం చేస్తోంది. అయితే క్యాబ్ డ్రైవర్ పాండురంగ్‌ గొసావి అతని స్నేహితుడు ఉమేష్‌ జస్వంత్‌లు బాధితురాలిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. మహిళ నుండి బంగారు ఆభరణాలను దోచుకొన్నారు.

క్యాబ్‌ను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్ళి

క్యాబ్‌ను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్ళి

కషిమిరా ప్రాంతం నుంచి థానే వెళ్లేందుకు బాధిత మహిళ ఈనెల 19 సాయంత్రం గొసావి క్యాబ్‌లో ఎక్కారు. క్యాబ్‌ను వజ్రేశ్వరి ప్రాంతానికి మళ్లించిన గొసావి అక్కడి నిర్మానుష్య ప్రాంతంలో ఆమె నుంచి డబ్బు, మొబైల్‌ ఫోన్‌, పర్సును గుంజుకుని అనంతరం లైంగిక దాడికి పాల్పడ్డాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

నిలదీసిన లాడ్జీ మేనేజర్

నిలదీసిన లాడ్జీ మేనేజర్

బాధితురాలు తాను బస చేసిన లాడ్జీకి చేరకోగానే ఆమె అసలు విషయాన్ని లాడ్జీ మేనేజర్‌కు వివరించింది. లాడ్జీ మేనేజర్ క్యాబ్ డ్రైవర్ గోసావిని , అతని స్నేహితుడిని విచారించారు. లాడ్జీ మేనేజర్‌కు విషయం తెలిసిందని నిందితులు పారిపోయారు..

ఈ ఘటనతో సంబంధం లేదన్న ఓలా

ఈ ఘటనతో సంబంధం లేదన్న ఓలా

గొసావి గత వారం నుంచి డ్యూటీకి దూరంగా ఉన్నప్పటికీ కారుపై ఇప్పటికీ ఓలా స్టిక్కర్‌ ఉందని పోలీసులు తెలిపారు.ఈ ఘటనతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఓలా ప్రకటించింది.ఓలా ఫ్లాట్‌ఫాంపై ఈ నేరం జరగలేదని, విచారణ నిమిత్తం పోలీసులకు పూర్తిగా సహకరిస్తామని తెలిపింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A cab driver and his friend were arrested for allegedly raping a 32-year-old woman in Thane district, police said.The duo allegedly raped the woman while she was travelling from Kashimira to Thane near here on the night of December 19, they said.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి