వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వివాహిత దుస్తులిప్పేందుకు యత్నం: ఇద్దరి అరెస్ట్

నిందితులను నీలకంఠ్ గణపత్ రాథోడ్, శంకర్ జాదవ్‌లు బాధితురాలు గుర్తించిందని పోలీసులు చెప్పారు. నిందితులిద్దరూ నగరంలోని శివాజీనగర్‌లో నివాసం ఉంటున్నారని పోలీసులు తెలిపారు.
కర్ణాటక రాష్ట్రంలోని గుల్బర్గా ప్రాంతానికి చెందిన బాధితురాలు నిర్మాణ పనుల కూలీగా పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తోంది. అంబేద్కర్ విగ్రహం వీధిలో బాధితురాలి చీరను నిందితులు లాగారు. ఆ తర్వాత ఆమెను వివస్త్రను చేసేందుకు ప్రయత్నించారు. అంతేగాక తమతో గడిపేందుకు రూ. 2వేలు ఇస్తామని నిందితుల్లో ఒకడు ఆమెకు చెప్పాడు.
అందుకు బాధితురాలు నిరాకరించడంతో ఆమెపై దాడికి ప్రయత్నించారు. ఆమెను రక్షించడానికి వచ్చిన బాధితురాలి వదినపై కూడా లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. అక్కడ్నుంచి ఎలాగోలా తప్పించున్న ఇద్దరు బాధితులు పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.