మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదంపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందన ఇదే

న్యూఢిల్లీ: చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు నారీ శక్తి వందన్ అధినియమ్ పేరుతో లోక్‌సభలో ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం లభించడం ప్రధాని నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు. బిల్లుకు మద్దతు ఇచ్చిన పార్లమెంటు సభ్యులకు నరేంద్ర మోడీ ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా స్పందించారు.

'అసాధారణ మద్దతుతో లోక్‌సభలో రాజ్యాంగ సవరణ బిల్లు (128వ సవరణ) ఆమోదం పొందడం పట్ల చాలా సంతోషంగా ఉంది. పార్టీలకు అతీతంగా ఈ బిల్లుకు మద్దతు ఇచ్చిన ఎంపీలకు ధన్యవాదాలు. నారీ శక్తి వందన్ అధినియమ్ ఒక చారిత్రకమైన చట్టం. భవిష్యత్తులో ఇది మహిళా సాధికారతను ఎంతో పెంపొందిస్తుంది. మన రాజకీయ ప్రక్రియలో మహిళలు పెద్ద ఎత్తున భాగస్వాములు అయ్యేందుకు వీలు కల్పిస్తుంది' అని ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు.

Thank You all: PM Modi tweets after womens reservation bill passed in Lok Sabha

కాగా, చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన మహిళా రిజర్వేషన్ బిల్లు(women's reservation bill)కు లోక్‌సభ ఆమోదం తెలిపింది. నారీ శక్తి అధినియమ్ పేరుతో ఈ బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.

బుధవారం ఈ బిల్లుపై దాదాపు 8 గంటలపాటు సుదీర్ఘ చర్చ జరిగింది. అనంతరం బుధవారం రాత్రి న్యాయశాఖ మంత్రి తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. 454 మంది ఎంపీలు అనుకూలంగా.. ఇద్దరు వ్యతిరేకంగా ఓటేశారు. దీంతో చారిత్రక మహిళా బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపినట్లయింది.

మహిళా రిజర్వేషన్ బిల్లుపై మాన్యువల్ పద్ధతిలోనే ఓటింగ్ జరిగింది. ఎరుపు, ఆకుపచ్చ స్లిప్పులను లోక్‌సభలో సభ్యులందరికీ అందజేశారు. అనంతరం ఓటింగ్ జరిగే ప్రక్రియపై లోక్‌సభ సెక్రటరీ జనరల్ సభ్యులకు వివరించారు. బిల్లుకు మద్దతు తెలిపినట్లయితే.. 'ఎస్' అని ఆకుపచ్చ స్లిప్పుపై రాయాలని.. వ్యతిరేకిస్తే ఎరుపు స్లిప్పుపై 'నో' అని రాయాలని చెప్పారు.

ఆ తర్వాత ఓటింగ్ జరిగింది. రాజ్యాంగ సవరణ కూడా ఉండటంతో మాన్యువల్ పద్ధతిలో ఓటింగ్ చేపట్టారు. ఓటింగ్‌కు కొద్ది సేపటి ముందే ప్రధాని నరేంద్ర మోడీ సభలోకి వచ్చారు. ఆయన వచ్చని తర్వాత మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఓటింగ్ జరిగింది. దాదాపు సభలోనే అత్యధిక మంది సభ్యుల మద్దతుతో బిల్లుకు ఆమోదం లభించింది. అయితే, మహిళా రిజర్వేషన్లు మాత్రం వచ్చే సార్వత్రిక ఎన్నికలు జరిగిన తర్వాత నుంచే అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. కాగా, లోక్ సభలో ఆమోదం పొందిన మహిళా బిల్లు రాజ్యసభ ముందుకు రానుంది. అక్కడ కూడా ఆమోదం లాంఛనమేనని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+