వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొనసాగుతున్న ఎంపీల నిరసన - పార్లమెంట్ ప్రాంగణలోనే రాత్రంతా..!!

|
Google Oneindia TeluguNews

పార్లమెంట్ గాంధీ విగ్రహం వద్ద ఎంపీల నిరసన కొనసాగుతోంది. రాజ్యసభలో 20 మంది ఎంపీలను సస్పెండ్ చేసారు. వారి పైన సస్పెన్షన్ ఎత్తివేయాలని కోరుతూ విపక్షాలు 50 గంటల నిరసన కొనసాగిస్తున్నాయి. ఇదే సమయంలో తమ షరతులకు అంగీకరిస్తేనే విపక్షాలు కోరుతున్నట్లుగా సస్పెన్షన్ ఎత్తివేసే అంశం పరిశీలిస్తామని అధికార వర్గం స్పష్టం చేస్తోంది. మంగళవారం రాజ్యసభ నుంచి 24 మంది సభ్యులను సస్పెండ్ చేసారు. బుధవారం సైతం సభలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. బుధవారం మరో రాజ్యసభ ఎంపీపై వేటు పడింది.

సస్పెన్షన్ కు వ్యతిరేకంగా నిరసన

సస్పెన్షన్ కు వ్యతిరేకంగా నిరసన


అనుచితంగా ప్రవర్తన కారణంగా ఆమ్​ఆద్మీ పార్టీ నేత సంజయ్​ సింగ్​ను సస్పెండ్​ చేశారు. దీంతో..ఇంత మంది సభ్యులను సస్పెండ్ చేయటం పైన విపక్షాలు నిరసన వ్యక్తం చేసాయి. కండీషన్లకు ఒప్పుకొనేది లేదని తేల్చి చెప్పాయి. సస్పెన్షన్ కు నిరసనగా రాజ్యసభ ఎంపీలు పార్లమెంటు ఆవరణలో నిరసనకు దిగారు. 50 గంటలపాటు ఇలానే ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. గత రెండు రోజుల్లో సస్పెన్షన్​కు గురైన 20 మంది ఎంపీల్లో తృణమూల్​ కాంగ్రెస్​కు చెందిన వారు ఏడుగురు, డీఎంకే నుంచి ఆరుగురు, తెరాస చెందిన వారు ముగ్గురు, సీపీఎం నుంచి ఇద్దరు, సీపీఐ ఆమ్​ఆద్మీల నుంచి చెరో ఎంపీ ఉన్నారు.

ఆరుబయట రాత్రంతా నిరసన

ఆరుబయట రాత్రంతా నిరసన

అటు విపక్ష నేతలు రాజ్యసభ ఛైర్మన్ తోనూ సంప్రదింపులు చేస్తున్నారు. కానీ, ఛైర్మన్ మాత్రం చేసిన తప్పును ఒప్పుకుంటేనే సస్పెన్షన్​ తొలగిస్తానని వెంకయ్య స్పష్టం చేశారు. 10 మంది నేతలు పాల్గొన్న ఈ భేటీలో ధరల పెంపుపై సభలో చర్చకు అవకాశం కల్పించాలని నేతలు వెంకయ్యకు విజ్ఞప్తి చేశారు. ఇక, పార్లమెంట్ ప్రాంగణంలోని గాంధీ విగ్రహం వద్ద ఎంపీల నిరసన కొనసాగుతోంది. రాత్రంతా వారు ఆరు బయటే నిద్రించారు. నిరసనలో ఉన్న ఎంపీలకు టీఎంసీ రాత్రి భోజనం అందించింది.

తప్పు అంగీకరిస్తేనే పరిశీలన

తప్పు అంగీకరిస్తేనే పరిశీలన

ఈ రోజు నిరసన కొనసాగనుండటంతో వారికి భోజనం ఏర్పాటుకు టీఆర్ఎస్ ముందుకొచ్చింది. అదే విధంగా రాత్రి భోజనం ఆప్ ఏర్పాటు చేయనుంది. నిరసనలో పాల్గొన్న ఎంపీలు పత్రికలు.. మొబైల్ ఫోన్లలో వీడియోలు చూస్తూ కనిపించారు. కాగా, 50 గంటల దీక్ష కొనసాగిస్తామని.. లేకుంటే, సస్పెన్షన్ ఎత్తివేస్తే నిరసన విరమిస్తామని నేతలు స్పష్టం చేస్తున్నారు. ఈ రోజు సభ ప్రారంభమైన తరువాత మరోసారి 50 గంటల నిరసన.. సస్పెన్షన్ ఎత్తివేత పైన చర్చలు జరిగే అవకాశం కనిపిస్తోంది.

English summary
The 50-hour long protest by the suspended MPs spent the first night in the open air inside the Parliament Complex.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X