ఆప్‌కు నోటా కంటే తక్కువ ఓట్లు...! పోటి చేసింది 70 స్థానాల్లో
ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీకి రెండు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో ఘోరమైన ఫలితాలను మూటగట్టుకుంది. అటు హార్యాణ, ఇటు మహారాష్ట్రాల్లో పోటీచేసిన ఆప్ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. దీంతో చీపురు గుర్తుపై పోటి చేసిన నేతలు నోటా కంటే తక్కువ ఓట్లు సాధించారు.
మరికొద్ది రోజుల్లో ఢిల్లీలో ఎన్నికలను ఎదుర్కోబోతున్న అమ్ఆద్మీ పార్టీ ప్రస్తుతం జరిగిన మహారాష్ట్ర మరియు హర్యాన ఎన్నికల్లో పోటీ చేసింది. కాగా మహాలో 24 స్థానాలు, హరియాణాలో 46 స్థానాల్లో పోటీ చేసింది. అయితే రెండు రాష్ట్రాల్లో తాను పోటి చేసిన 70 స్థానాల్లో కూడ పార్టీ అభ్యర్థులు ఘోరంగా ఓటమి చవి చూశారు. రెండు రాష్ట్రాల్లో కూడ నోటా కంటే తక్కువ ఓట్లు ఆప్ అభ్యర్థులు మూటగట్టుకున్నారు.

కాగా హర్యాణలో 0.48 శాతం ఓట్లను సాధించగా నోటాకు 0.53 శాతం వచ్చాయి. ఇక మహారాష్ట్రాల్లో ఆప్‌కు 0.11 శాతమే ఓట్లు పోలయ్యాయి అయితే నోటాకు అంతకంటే ఎక్కువగా 0.53 శాతం ఓట్లు పోలయ్యాయి. కాగా 70 స్థానాల్లో పోటి చేసిన ఆమ్ ఆద్మీ అభ్యర్థులు ఏ ఒక్క స్థానంలో కూడ వెయ్యి ఓట్లు దాటని పరిస్థితి కనిపించింది. కాగా హర్యాణలో సీఎం కేజ్రీవాల్ లోక్‌సభ స్థానాల్లో పోటీ చేసి ఘోరపరాజయం పాలయ్యాడు.












Click it and Unblock the Notifications