భార్యకు కోట్లలో ఆస్తి, భర్తకు అక్రమ సంబంధం, విదేశాల్లో మీడియేటర్ ఏం చేశాడంటే ?, మూడేళ్లకు !
విదేశాల్లో తలదాచుకుని అక్కడి నుంచి కిరాయి ఇచ్చి భార్యను పక్కాప్లాన్ తో హత్య చేయించిన భర్తతో పాటు ఆ హత్యకు సహకరించిన నిందితుడిని అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్టు చేశారు. కర్ణాటకలోని ఉడిపి జిల్లాలోని బ్రహ్మావర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుమ్రగోడులోని మిలన్ అపార్ట్ మెంట్ లో నివాసం ఉండే విశాల గనిగ అనే మహిళ హత్య కేసు కర్ణాటకలో కలకలం రేపింది
2021 జూలైలో విశాల గనిగ అలియాస్ విశాల అనే మహిళ హత్య కేసులో పరారీలో ఉన్న నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితులు విశాల భర్త రామకృష్ణ, సుపారీ కిల్లర్లు స్వామినాథన్ నిషాద్, రోహిత్ రాణా ప్రతాప్‌లను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.సుపారీ కిల్లర్ స్వామినాథన్ నిషాద్‌ని విశాల భర్త రామకృష్ణకు పరిచయం చేసిన ధర్మేంద్ర కుమార్ సుహానీ మూడేళ్లుగా విదేశాల్లో తలదాచుకున్నాడు.

2021 జూలై 12వ తేదీన బ్రహ్మావర్‌లోని కుమ్రగోడ్‌లోని మిలన్ రెసిడెన్సీలో విశాల గనిగను సుపారీ హంతకులు హత్య చేసి బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. ఆస్తి తగాదాల కోసం విశాల హత్యకు రూ.4 లక్షలు సుపారి ఇచ్చారని పోలీసులు చెప్పారు. హంతకులకు సుమారి ఇచ్చింది విశాల భర్త భర్త రామకృష్ణ అని వెలుగు చూసింది. ఉత్తరప్రదేశ్ లోని గోరకాపూర్‌కు చెందిన స్వామినాథ్ నిషాద్‌లను తరువాత అరెస్టు చేశారు.

ఉత్తరప్రదేశ్‌కు చెందిన రోహిత్ రాణా ప్రతాప్ నిషాద్ ముంబాయిలోని గ్రాంట్ రోడ్‌లో నివసించేవాడు. అయితే విశాల హత్య తర్వాత నిందితుడు ప్రతాప్ నిషాద్ ముంబాయి వెళ్లలేదు. మా కొడుకు ప్రతాప్ కనిపించడం లేదని అతని తల్లిదండ్రులు ముంబాయిలోని గామ్‌దేవి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. స్వామినాథ్‌తో కలిసి విశాలను హత్య చేసిన ప్రతాప్ తరువాత నేపాల్ సరిహద్దులోని మహరాజ్‌గంజ్‌లో తలదాచుకున్నాడు. అక్కడ సాధువులతో కలిసి ఉంటే పోలీసులు పట్టుకోలేరని ప్రతాప్ ప్లాన్ చేశాడు.
కొద్దిరోజుల తర్వాత అక్కడి నుంచి గోవా వెళ్లాడు. బ్రహ్మావర పోలీసులు గోవాకు వెళ్లగా అక్కడి నుంచి పారిపోయిన ప్రతాప్ తరువాత గోరకపూర్ చేరుకున్నాడు. అయితే 10వ తరగతి వరకు చదివిన ప్రతాప్ మొబైల్ ఫోన్ వాడలేదని, అందుకే అతన్ని మొబైల్ లొకేషన్ కదలికను పోలీసులు కనుక్కోలేకపోయారు. అయితే సొంత ఊరికి వెళ్లిన ప్రతాప్ చివరికి పోలీసులకు చిక్కిపోయాడు. విశాలను హత్య చెయ్యడానికి ఆమె భర్తకు కిరాయి హంతకులను పరిచయం చేసిన ధర్మేంద్ర కుమార్ మూడు సంవత్సరాల తరువాత ఇప్పుడు ఉడిపి జిల్లా పోలీసులకు చిక్కిపోయాడు. విశాల గనిగ భర్తకు అక్రమ సంబంధం ఉందని, ప్రియురాలి మోజులో పడి భార్య ఆస్తి కోసం ఆమెను హత్య చేశాడని పోలీసు అధికారులు తెలిపారు.
-
Amaravati: అమరావతి పేరు మార్పు..! సర్కార్ ఉత్తర్వులు జారీ..! -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
ప్రధాని మోదీకి అనూహ్య మద్దతు- లిఖితపూర్వకం -
బిగ్ షాక్: దేశవ్యాప్తంగా ప్రతిరోజూ సాయంత్రం 2 గంటలు కరెంట్ కట్..! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
H-1B Visa జారీ ఇకపై మరింత.. !! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
స్టాలిన్ చేతికి ఇంటెలిజెన్స్ సర్వే..! షాకింగ్ అంశాలు-ఎక్స్ ఫ్యాక్టర్ గా విజయ్ ? -
today rashiphalalu: ఆర్థికంగా లాభాలున్నాయి, ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి












Click it and Unblock the Notifications