జయలలిత మేనకోడలు దీపా కొత్త పార్టీ: బీజేపీ చీఫ్ అమిత్ షా ఆరా !
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రి పొన్ రాధకృష్ణన్, తమిళనాడు బీజేపీ శాఖ అధ్యక్షురాలు తమిళసై సౌందరరాజన్ తో భేటీ అయ్యారు. జయలలిత మేనకోడలు దీపాను వెనుక నుంచి నడిపించే రాజకీయ శక్తులు ఎవరు ?
చెన్నై: అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళ లక్షంగా తమిళనాడులో మరో కొత్త పార్టీ అవిర్భవించనుందా? దివంగత ముఖ్యమంత్రి జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ కొత్త పార్టీకి సారధ్యం వహించనున్నారా ? అంటే అందులో సందేహం లేదు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
జయలలిత మరణంతో తమిళనాడు రాష్ట్రంలో రాజకీయ శూన్యత ఏర్పడింది. తమిళనాడులో అధికారంలో ఉన్న అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళ బాధ్యతలు స్వీకరించిన తరువాత ఆపార్టీలో అనిశ్చితి కొనసాగుతుంది.
శశికళ మీద కోపంతో జయలలిత ఆత్మ ఇలా తిరుగుతుందా ?
అన్నాడీఎంకే మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పార్టీ చీఫ్ గా శశికళ ఎంపికను ఏకపక్షంగా కానిచ్చేయడంతో ఆ పార్టీ ద్వితీయశ్రేణి నాయకులతో పాటు క్షేత్రస్థాయి కార్యకర్తల వరకు అసంతృప్తితో రగిలిపోతున్నారు.

శశికళ ఫోటోతో కూడిన ఫ్లెక్సీలు కనపిడితే చించేసి నిరసన వ్యక్తం చేస్తున్నారు. సేలం జిల్లా కేంద్రంగా దీపా పేరవై తమిళనాడు రాష్ట్రం మొత్తం విస్థరిస్తూ సభ్యత్వ నమోదుతో ముందుకు వెళుతోంది.
షాక్: జయ ఆశయాలకు చెక్ ! మోడీకి జై కొట్టిన పన్నీర్ సెల్వం
దీపా రాజకీయరంగ ప్రవేశంపై భారతీయ జనతాపార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆరా తీస్తున్నారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన సమావేశంలో తమిళనాడు సీనియర్ నాయకుడు. కేంద్ర మంత్రి పొన్ రాధకృష్ణన్, ఆరాష్ట్ర బీజేపీ శాఖ అధ్యక్షురాలు తమిళసై సౌందరరాజన్ హాజరైనారు.
ఆ సందర్బంలో తమిళనాడు రాష్ట్ర రాజకీయాల గురించి సుదీర్ఘంగా ముగ్గురు చర్చించారు. ముఖ్యంగా జయలలిత మేనకోడలు దీపా రాజకీయ రంగప్రవేశంపై చర్చించిన అమిత్ షా ఆమెను వెనుక నుంచి నడిపించే రాజకీయ శక్తులు ఎవరు ? దీపా పేరవై రాష్ట్ర వ్యాప్తంగా ఇంత తక్కువ సమయంలో ఎలా విస్థరించింది ? అని అమిత్ షా ఆరా తీశారని తమిళనాడు బీజేపీ వర్గాలు తెలిపాయి.












Click it and Unblock the Notifications