ఆలస్యం చేస్తున్న హైకమాండ్, అన్ని లెక్కలు వేస్తున్న మోదీ, అమిత్ షా, షిండేకి !
ముంబాయి/న్యూఢిల్లీ: కర్ణాటకలో చిత్తుచిత్తుగా ఓడిపోయిన బీజేపీకి మరో సవాలు ఎదురైయ్యింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చరిష్మా ఉంటే మాకు తిరుగులేదని అనుకుంటున్న బీజేపీ నాయకులకు రానురాను చుక్కలు కనపడుతున్నాయి. శివసేన పార్టీని విభజించి మహారాష్ట్రాలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీజేపీకి ఇప్పుడు మరో సవాలు ఎదురైయ్యింది.
ఆటో డ్రైవర్ ఏక్ నాథ్ షిండేని ఏకంగా సీఎం చేసి అందరికి షాక్ ఇచ్చిన బీజేపీ ఇప్పుడు అయోమయంలో పడిపోయంది. మహారాష్ట్ర మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్ ను మరోసారి సీఎం చేస్తారని అందరూ అనుకుంటున్న సమయంలో బీజేపీ హైకమాండ్ ఎవ్వరూ ఊహించని విధంగా శివసేన రెబల్ నాయకుడు ఏక్ నాథ్ షిండేని సీఎం చేసి అందరికి షాక్ ఇచ్చింది.

మహారాష్ట్రలో రాష్ట్ర మంత్రివర్గాన్ని త్వరలో విస్తరిస్తారని, దానికి సంబంధించిన టైమ్‌లైన్‌ను సీఎం ఏక్‌నాథ్ షిండే నిర్ణయిస్తారని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ సోమవారం తెలిపారు. జూన్ 4న ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయిన తరువాత ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన, బీజేపీ కలిసి అన్ని ఎన్నికల్లో పోటీ చేస్తాయని కూడా దేవేంద్ర ఫడ్నవీస్ చెప్పారు.
మహారాష్ట్రలో ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని ప్రభుత్వం బాధ్యతలు చేపట్టి ఇప్పటికే 10 నెలలు అయ్యింది, అయితే మంత్రివర్గంలో 40 శాతం మాత్రమే పనిచేస్తోంది.
నిబంధనల ప్రకారం, రాష్ట్రంలోని మంత్రి మండలిలో గరిష్టంగా 43 మంది మంత్రులు ఉండటానికి అవకాశం ఉంది. అయితే మహారాష్ట్రలో ప్రస్తుతం 18 మంది మంత్రులు మాత్రమే ఉన్నారు. 18 మంది మంత్రులు గత ఏడాది ఆగస్టు 9న ప్రమాణ స్వీకారం చేశారు.
మిగిలిన 60 శాతం మంత్రి వర్గం ఏర్పాటు చెయ్యడంలో ఏక్ నాథ్ షిండే, దేవేంద్ర ఫడ్నవీస్ బీజేపీ హైకమాండ్ ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నారని తెలిసింది.

అన్ని పనులు పూర్తిగా జరగాలంటే మంత్రివర్గ విస్తరణ పూర్తిగా జరగాలి. అయితే శివసేనలో చీలికలు రావడం, చీలిపోయిన శివసేనతో బీజేపీ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చెయ్యడంతో మంత్రి వర్గ విస్తరణ విషయంలో అసలు సమస్య మొదలైయ్యింది. చీలిపోయిన శివసేన ఎమ్మెల్యేలకు న్యాయం చెయ్యకపోతే మొదటికే మోసం వస్తుందని, అందుకే మంత్రివర్గ విస్తరణలో జాప్యం జరుగుతోందని తెలిసింది.
మహారాష్ట్ర ప్రభుత్వం తన మంత్రివర్గాన్ని విస్తరించాల్సిన అవసరం ఉంది. రాజకీయ పరిశీలకులు మహారాష్ట్రలో మంత్రివర్గ విస్తరణ ఒక వ్యూహాత్మకం అని, వచ్చే ఎన్నికల ఫలితాలతో పోల్చుకుంటున్నారని, కులం, మతం, ప్రభావం, వ్యక్తిగత మద్దతుతో పాటు ఇతర అంశాలు పరిశీలిస్తున్నారని తెలిసింది. సార్వత్రిక ఎన్నికల నెలరోజుల తర్వాత 2024లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మరియు మంత్రివర్గ చేరికలు వారిపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
ఆగస్టులో కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పుడు, బీజేపీ, ఏక్ నాథ్ షిండే 1:1 ఫార్ములాతో బీజేపీ నుండి తొమ్మిది మంది మంత్రులు మరియు షిండే శిబిరం నుండి తొమ్మిది మందిని చేర్చుకున్నారు.
అయితే బీజేపీ తన సంస్థ మరియు మిత్రపక్షాలలో పోటీ ప్రయోజనాలను సమతుల్యం చేయడానికి ప్రయత్నిస్తుందా అనే ప్రశ్న వచ్చింది.
శివసేన వర్గాన్ని అసలు ఒకటిగా పరిగణిస్తారనే సమస్య కూడా ఉంది. ఎన్నికల సంఘం ఏక్ నాథ్ షిండేకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరిలో మాత్రమే ఇది పరిష్కరించబడింది.
-
బీహార్ సీఎంగా లాలూకు నమ్మినబంటు: నాడు రబ్రీదేవి కేబినెట్ లో మంత్రి -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..!












Click it and Unblock the Notifications