ఓటు మన ఆయుధం, పెళ్లిలో పెళ్లికూతురు, పెళ్లికొడుకు స్టేజ్ మీద వెరైటీ ప్రచారం !
బెంగళూరు/కోలారు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ఈనెల 10వ తేదీన జరగనున్నాయి. ఈనెల 10వ తేదీ పోలింగ్ జరగనుంది. ఇదే నెల 13వ తేదీన కౌంటింగ్ నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎన్నికల అధికారులు అనేక రకాలుగా ప్రచారం చేస్తున్నారు.
ఇప్పటికే స్కూల్ టీచర్లు అన్ని నియోజక వర్గాల్లో తిరుగుతూ ప్రతిఒక్కరు ఓటు వెయ్యాలని నినాదాలు చేస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకువస్తున్నారు. పెళ్లిలో పెళ్లికూతురు, పెళ్లి కొడుకు మే 10వ తేదీన ప్రతి ఒక్కరు ఓటు వెయ్యాలని ప్లే కార్డులు పట్టుకుని పెళ్లికి వచ్చిన బంధువులు, స్నేహితులకు మనవి చేస్తున్న సమయంలో తీసిన ఫోటోలు వైరల్ అయ్యాయి.

కర్ణాటకలోని కోలారు జిల్లాలోని ముళబాగిల్ పట్టణంలోని ముత్యాలపేటలోని శ్రీ ఉద్దభవ శివలింగేశ్వరి స్వామి ఆలయానికి చెందిన ఫంక్షన్ హాల్ లో చరణ్ రాజ్, ప్రమిళ అనే యువతి, యువకుడు వివాహం చేసుకున్నారు. చరణ్ రాజ్, ప్రమిళ పెళ్లికి సుమారు 600 మందికి పైగా బంధువులు, స్నేహితులు హాజరైనారు.
వివాహం చేసుకున్న చరణ్ రాజ్, ప్రమిళ చేతిలో ఫ్లైకార్డులు పట్టుకున్నారు. మే 10వ తేదీన ఎన్ని పనులు ఉన్నా ఏదో ఒకటైమ్ లో వెళ్లి ఓటు వెయ్యాలని బంధువులు, స్నేహితులకు నవవధూవరులు చరణ్ రాజ్, ప్రమిళ ప్లైకార్డులు పట్టుకునిన మనవి చేశారు. చాలసేపు పెళ్లి వేడుక జరిగిన స్టేజ్ మీద నూతనవధూవరులు ఇలా బంధువులకు ప్లైకార్డులు చూపిస్తూ అందరిని నవవధూవరులు ఆకట్టుకున్నారు.

మళబాగిల్ నియోజక వర్గం ఎన్నికల నోడల్ అధికారి సునీల్ ఆలోచనతో నవవధూవరులు వాళ్ల పెళ్లికి హాజరైన బంధువులకు మీరు హక్కు వినియోగించుకోవాలని మనవి చేశారు. చిక్కబళ్లాపురం జిల్లాలోని బాగేపల్లిలో జరిగిన పెళ్లి రిసెప్షన్ కార్యక్రమంలో కూడా నూతన వధూవరులు ఇలాగే పెళ్లికి వచ్చిన వారికి ఓటు హక్కు వినియోగించుకోవాలని బంధువులకు మనవి చేశారు.












Click it and Unblock the Notifications