Union Budget 2025: బడ్జెట్‌ తయారీ వేళ “లాక్ఇన్” పీరియడ్‌..!!

ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. ఇప్పటికే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ పూర్తి గా బడ్జెట్ తయారీలో నిమగ్నమయ్యారు. ఈ సారి మోదీ మార్క్ బడ్జెట్ ఉంటుందనే అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. ఎంతో మంది ఈ బడ్జెట్ ప్రతిపాదనల పైన ఆసక్తిగా ఉన్నారు. అయితే, బడ్జెట్ రూపకల్పన ప్రక్రియ చాలా రహస్యంగా ఉంటుంది. పొరపాటున లీక్ అయితే భారీ ప్రభావం చూపుతుంది. ఇప్పటి వరకు ఒక సారి ఈ విధంగా జరిగింది. ఆ తరువాత బడ్జెట్ తయారీ సిబ్బంది మొదలు.. ప్రింటింగ్.. సభలో ప్రవేశ పెట్టే వరకు మొత్తం డేగ కన్ను లా భద్రత ఏర్పాటు చేసారు.

కేంద్రం ఫిబ్రవరి 1న సాధారణ - రైల్వే బడ్జెట్ కలిపి ప్రవేశ పెట్టనున్నారు. ఇప్పటికే హల్వా వేడుక ద్వారా బడ్జెట్ తయారీ ప్రక్రియ మొదలైంది. పార్లమెంట్‌లో బడ్జెట్‌ ప్రసంగం ముగిసే వరకు బడ్జెట్‌పై పని చేస్తున్న అధికారులు నార్త్‌ బ్లాక్‌లోనే ఉండిపోవాల్సి వస్తుంది. దీన్నే "లాక్-ఇన్" పీరియడ్‌ అంటారు. బయటి ప్రపంచంతో వారికి సంబంధాలు ఉండవు. అత్యవసర సమయంలో భద్రతా సిబ్బంది సమక్షంలో ఉన్న ఫోన్లను వినియోగించుకునే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ ప్రతిష్ఠకు సంబంధించిన అంశం కావటంతో చాలా పకడ్బందీగా సభలో బడ్జెట్ ప్రవేశ పెట్టే వరకూ జాగ్రత్తలతో వ్యవహరిస్తారు.

The budget printing process has been enhanced with an emphasis on security and confidentiality details here

ఇప్పటి వరకు ఒక సారి బడ్జెట్ లీకయిన ఘటన.. మంత్రి రాజీనామా చోటు చేసుకున్నాయి. 1950 లో మింట్‌రోడ్‌లోని రాష్ట్రపతి భవన్‌లో ప్రెస్‌ ఉండేది. అదే ఏడాది రాష్ట్రపతి భవన్ ప్రెస్‌ నుంచి కేంద్ర బడ్జెట్ లీక్‌ అయ్యింది. దీనితో అప్పటి ఆర్థిక మంత్రి జాన్ మథాయ్​ బడ్జెట్ సమర్పించిన కొద్ది సేపటి తర్వాత రాజీనామా చేశారు. ఈ ఘటన తరువాత బడ్జెట్ ముద్రణను - మింటో రోడ్​లోని ప్రభుత్వ ప్రెస్​కు మార్చారు. దాని తరువాత లాక్​-ఇన్​ వ్యవధిని కూడా ప్రవేశపెట్టారు. ఎల్లప్పుడూ సీసీటీవీ కెమెరాలు, ఇంటెలిజెన్స్ బ్యూరోల నిరంతర పర్యవేక్షణలో బడ్జెట్ తయారీ ప్రక్రియ కొనసాగుతుంది.

బడ్జెట్ తయారీలో భాగస్వాములుగా ఉన్న అధికారులు బడ్జెట్ పార్లమెంట్ లో ప్రవేశ పెట్టిన తరువాతనే బయటకు వస్తారు. ఆర్దిక మంత్రిత్వ శాఖలో కీలక స్థానాలో ఉన్న అధికారులకు ఈ బాధ్యతలు అప్పగిస్తారు. బడ్జెట్ ప్రతిపాదించే సమయంలో మాత్రమే పత్రాలు సీల్డ్ తో పార్లమెంట్ కు చేరుకుంటాయి. కాగా, ఈ సారి ఆర్దిక మంత్రిగా నిర్మలా సీతారామన్ 8వ సారి వరుసగా బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. ఢిల్లీ ఎన్నికల వేళ ప్రవేశ పెడుతున్న ఈ బడ్జెట్ లో సామాన్యులను రిలీఫ్ ఇచ్చే నిర్ణయాలు ఉంటాయా లేదా అనేది ఆసక్తి కరంగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+