భార్యను వేధింపులకు గురిచేసిన బిజినెస్‌మెన్‌కు తొమ్మిదేళ్ల జైలుశిక్ష‌..

భార్య‌ను వేధింపుల‌కు గురిచేసిన ఓ వ్యాపార‌వేత్త‌కు న్యాయ‌స్థానం తొమ్మిదేళ్ల జైలు శిక్ష విధించింది. ఓ బిజినెస్‌మెన్ అసహజ శృంగారానికి భార్యను బలవంతం చేశాడు. దాంతో అత‌నికి న్యాయస్థానం తొమ్మిదేళ్ల కఠిన కారాగార శిక్షను వేసింది. ఈ ఘ‌ట‌న ఛ‌త్తీస్‌ఘ‌డ్‌లో జ‌రిగింది.

రాష్ట్రంలోని దుర్గ్‌కు చెందిన ఓ ప్ర‌ముఖ వ్యాపారవేత్త వివాహ‌మ‌యిన‌ప్ప‌టి నుంచి భార్య‌ను నానార‌కాలుగా ఇబ్బందిపెడుతున్నాడు. పేరుకు వ్యాపార‌వేత్తే అయినా చేసే పనుల‌న్నీ నీచ‌పు ప‌నులు. అత‌నో కామా పిశాచి. పెళ్ల‌యిన కొద్దిరోజుల‌కే భార్య‌కు న‌ర‌కం చూపించాడు. ఆమెను మాన‌సికంగా హింసించ‌డ‌మే కాకుండా శారీర‌కంగా కూడా చిత్ర‌హింసల‌కు గురిచేశాడు. అస‌హ‌జ శృంగారం చేయాలంటూ భార్య‌ను బ‌ల‌వంతం పెట్టాడు. కొన్నేళ్ల‌పాటు ఈ న‌ర‌కాన్ని భరించిన ఆమె చివ‌రికి తెగించి, కూతురిని తీసుకుని పుట్టింటికి వెళ్లింది. ఇక‌, భ‌ర్త‌తో క‌లిసి ఉండ‌లేనంటూ కోర్టులో కేసు వేసింది.

The businessman who harassed his wife was sentenced to nine years in prison

9 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ. 1,000 జరిమానా...

భిలాయ-దుర్గ్ జంట నగరాలకు చెందిన ఓ బిజినెస్‌మేన్‌కు 2007లో పెళ్ల‌యింది. పెళ్లైన కొద్ది రోజులకే అత‌ను భార్య‌ను వేధించ‌డం మొద‌లుపెట్టాడు. పాప పుట్టినా అతని ప్ర‌వ‌ర్త‌న‌లో మాత్రం ఎటువంటి మార్పు రాలేదు. ఈ వేధ‌న‌ను కొన్నాళ్ల‌పాటు భ‌రించిన ఆమె ఇక అత‌నితో క‌లిసి ఉండ‌లేన‌ని నిర్ణ‌యం తీసుకుంది. దీంతో కూతురిని తీసుకుని 2016లో పుట్టింటికి చేరింది. అదే ఏడాది మే 7 సుపేలా పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేసింది.

దీంతో పోలీసులు అత‌నిపై ఐపీసీ సెక్షన్ 377 ప్రకారం అసహజ లైంగిక సంబంధం, సెక్షన్ 498A కింద భర్త, అతడి తల్లిదండ్రులపై వరకట్న వేధింపులు కేసు పెట్ట‌డం జ‌రిగింది. ఈ కేసు దర్యాప్తును ప్రారంభించిన పోలీసులు నిందితుల‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇక‌, పోలీసుల విచారణలో బాధితురాలిని శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురిచేసినట్టు వెల్లడయ్యింది.

దీంతో భర్తను దోషిగా నిర్దారించింది న్యాయస్థానం. నిందితుడి నేరం IPC సెక్షన్ 377 కిందకి వస్తుందని, ఇది శిక్షార్హమైందని కోర్టు తీర్పును వెలువ‌రించింది. దీనికి అదనంగా ఒక సంవత్సరం శిక్ష విధించింది. మొత్తం 9 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ. 1,000 జరిమానాను కూడా విధించింది. రెండు శిక్షలు ఏకకాలంలో అమలు చేయాలని సూచించింది. అతని తల్లిదండ్రులకు కూడా ప‌ది మాసాల జైలు శిక్ష‌ను వేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+