సీఎం ఇంటిపై సీబీఐ, ఈడీ అధికారుల దాడులు

న్యూఢిల్లీ: హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ కు సీబీఐ, ఈడీ అధికారులు సినిమా చూపించారు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంతో పాటు న్యూఢిల్లీ లోని 11 ప్రాంతాలలో సోదాలు జరిపి విలువైన డాక్యూమెంట్లు స్వాధీనం చేసుకున్నారు.

ఆదాయానికి మించిన ఆస్తులు సమకూర్చుకున్నారని హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ (80), ఆయన భార్య ప్రతిభా సింగ్, కొడుకు విక్రమాదిత్య, కుమార్తె అపరాజితల మీద సీబీఐ అధికారులు కేసులు నమోదు చేశారు.

2009 నుంచి 2011 వరకు వీరభద్ర సింగ్ కేంద్ర మంత్రిగా పని చేశారు. ఆ సందర్బంగా అధికార దుర్వినియోగానికి పాల్పడి ఆదాయానికి మంచి ఆస్తులు సమకూర్చుకున్నారని ఆరోపణలు రావడంతో సీబీఐ అధికారులు కేసులు నమోదు చేశారు.

వీరభద్ర సింగ్ తో పాటు ఆయన కుటుంబ సభ్యుల మీద కేసులు నమోదు అయ్యాయి. వీరభద్ర సింగ్ అధికార దుర్వినియోగం చేసి రూ. 6.1 కోట్ల ఆస్తులు సమకూర్చుకున్నారని, మా దగ్గర ఆధారాలు ఉన్నాయని సీబీఐ అధికారులు ఆరోపించారు.

The CBI and ED have carried out a raid at the residence of Vidharbha Singh

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పని చేసిన రికార్డు వీరభద్ర సింగ్ కు ఉంది. ఇదే సమయంలో వీరభద్ర సింగ్ భార్య, పిల్లలు ఎలాంటి సెక్యూరిటి లేకుండా పలు ప్రైవేటు బ్యాంకులలో రుణాలు తీసుకున్నారని సీబీఐ అధికారులు అన్నారు.

దానికి బదులుగా ఆయా కంపెనీలకు సీఎంగా ఉన్న వీరభద్ర సింగ్ సహాయం చేశారని ఆరోపణలు ఉన్నాయి. లంచాలు తీసుకున్నారని, మనీ లాండరింగ్, ఫోర్జరీ తదితర ఆరోపణలపై వీరభద్ర సింగ్ ఆయన కుటుంబ సభ్యుల మీద కేసులు నమోదు అయ్యాయి.

వీరభద్ర సింగ్ తో పాటు ఆయన కుటుంబ సభ్యుల ఇండ్లలో సోదాలు చేశారు. అదే విధంగా కేంద్ర మాజీ మంత్రి శంకర్ సింగ్ వాఘేలా ఇంట్లో కూడ సీబీఐ అధికారులు సోదాలు చేసి పలు డాక్యూమెంట్లు స్వాధీనం చేసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+