దేశం విశిష్ట నాయకుడిని కోల్పోయింది: మన్మోహన్ మృతి పట్ల ప్రధాని మోడీ
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ సందర్భంగా మన్మోహన్ సింగ్‌తో తనకున్న అనుబంధాన్ని ప్రధాని మోడీ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. దేశం ఒక విశిష్ట నాయకుడిని కోల్పోయిందని ఆయన వ్యాఖ్యానించారు.
భారతదేశం తన అత్యంత విశిష్ట నాయకులలో ఒకరైన డాక్టర్ మన్మోహన్ సింగ్ జీని కోల్పోయినందుకు సంతాపం వ్యక్తం చేశారు ప్రధాని మోడీ. నిరాడంబరమైన మూలాల నుంచి వచ్చినప్పటికీ.. క్రమంగా ఎదిగి, గౌరవనీయమైన ఆర్థికవేత్తగా ఎదిగాడు. అతను ఆర్థిక మంత్రిగా సహా వివిధ ప్రభుత్వ పదవులలో పనిచేశారు. సంవత్సరాలుగా మన ఆర్థిక విధానంపై బలమైన ముద్ర వేశారు. పార్లమెంట్‌లో ఆయన చేసిన జోక్యాలు కూడా తెలివైనవి. మన ప్రధానిగా ప్రజల జీవితాలను మెరుగుపరిచేందుకు మన్మోహన్ సింగ్ విస్తృతంగా కృషి చేశారని మోడీ ప్రశంసించారు.

తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనూ మన్మోహన్ సింగ్‌ను పలుమార్లు కలిసినట్లు తెలిపారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ జీ, నేను ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, నేను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు క్రమం తప్పకుండా పరస్పరం సంభాషించాము. మేము పాలనకు సంబంధించిన వివిధ విషయాలపై విస్తృతమైన చర్చలు జరిపాము అని నరేంద్ర మోడీ గుర్తు చేసుకున్నారు.
మన్మోహన్ సింగ్‌లో జ్ఞానం, వినయం ఎల్లప్పుడూ కనిపించేవని ప్రధాని మోడీ అన్నారు. ఈ దుఃఖ సమయంలో, నా ఆలోచనలు డాక్టర్ మన్మోహన్ సింగ్ జీ కుటుంబం, ఆయన స్నేహితులు, అసంఖ్యాక అభిమానులతో ఉన్నాయి. ఓం శాంతి అని సోషల్ మీడియా వేదికగా ప్రధాని మోడీ పేర్కొన్నారు.
Dr. Manmohan Singh Ji and I interacted regularly when he was PM and I was the CM of Gujarat. We would have extensive deliberations on various subjects relating to governance. His wisdom and humility were always visible.
— Narendra Modi (@narendramodi) December 26, 2024
In this hour of grief, my thoughts are with the family of… pic.twitter.com/kAOlbtyGVs
మన్మోహన్ సింగ్ మృతి పట్ల కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. భారత మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నేత డాక్టర్ మన్మోహన్ సింగ్ పరమపదించారని తెలిసి తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను. గత కొంతకాలంగా వృద్ధాప్య సంబంధిత సమస్యలతో బాధపడుతున్న డాక్టర్ మన్మోహన్ ఢిల్లీ ఏయియ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కాసేపటి క్రితం కన్నుమూశారని తెలిసిందన్నారు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్‌గా, ప్రణాళికా సంఘంలో కీలక బాధ్యతల్లో, యూజీసీ చైర్మన్‌గా, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా వారు దేశానికి వన్నెతీసుకొచ్చారు. పీవీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, దేశ ఆర్థిక మంత్రిగా.. దేశంలో సంస్కరణలు తీసుకురావడంలో వారు పోషించిన పాత్రను దేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది. 2019లో నేను పార్లమెంటు సభ్యుడిగా ఉన్న సమయంలో వారు అప్పుడప్పుడూ పార్లమెంటు వీల్ చైర్లో రావడం నాకు గుర్తుంది. పార్లమెంటు సభ్యుడిగా వారి అంకితభావానికి ఇది నిదర్శనం. మేధావి, మితభాషి, సౌమ్యుడు, స్థిత ప్రజ్ఞత కలిగిన నేతగా.. మన్మోహన్ సింగ్ మన యువతరానికి ఆదర్శం అని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
మన్మోహన్ సింగ్ మరణం దేశానికి తీరని లోటు. నిరాడంబర జీవితం, దేశం పట్ల వారి అంకిత భావం భావితరాలకు స్ఫూర్తి దాయకం. ఆ మహనీయుని ఆత్మకు శాంతి సద్గతులు ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
కాగా, మాజీ ప్రధానమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ సింగ్ (92) గురువారం రాత్రి కన్నుమూశారు. గురువారం సాయంత్రం తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆయనను ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అత్యవసర విభాగంలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. కాగా, కేంద్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో మన్మోహన్ సింగ్ అంత్యక్రియలను నిర్వహించనుంది. వారంపాటు సంతాప దినాలను కేంద్రం ప్రకటించింది.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications