Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Crime News: 30 మంది పిల్లలపై అత్యాచారం చేసి హత్య.. మానవ మృగాన్ని దోషిగా తేల్చిన కోర్టు..

అభం శుభం తెలియని 30 మంది పిల్లలపై లైంగిక దాడి చేసి హత్య చేసిన నరరూప రాక్షసుడిని కోర్టు దోషిగా తేల్చింది. అతడికి రెండు వారాల్లో శిక్ష ఖారారు చేయనుంది. ఢిల్లీలో కూలీగా పనిచేస్తున్న రవీంద్ర అనే వ్యక్తి డ్రగ్స్ కు బానిసగా మారి, అశ్లీల చిత్రాలను చూసి పిల్లలపై లైంగిక దాడి చేసి వారిని చంపేవాడని పోలీసులు తెలిపారు. రవీంద్ర 2008 నుంచి 2015 వరకు 30 పిల్లలను అత్యాచారం చేసి హత్య చేశాడు. రవీంద్రకు 18 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు వారి కుటుంబ ఉపాధి నిమిత్తం ఉత్తర ప్రదేశ్ లోని కాస్ గంచ్ నుంచి ఢిల్లీకి వచ్చింది.

రవీంద్ర తండ్రి ప్లంబర్‌గా పని చేయగా, అతని తల్లి ప్రజల ఇళ్లలో ఇంటి పని చేసేది. ఢిల్లీకి వచ్చిన కొద్ది రోజులకే డ్రగ్స్‌కు బానిసైన రవీంద్ర.. వీడియో క్యాసెట్‌లో అశ్లీల చిత్రాలు చూసేవాడు. రవీంద్రకుమార్ రోజంతా కూలి పని చేసి సాయంత్రం పూట డ్రగ్స్, మద్యం మత్తులో ఉండేవాడు. ఆ తర్వాత అశ్లీల చిత్రాలు చూసేవాడు. 8 గంటలకే పడుకుని అర్ధరాత్రి లేచి పిల్లల కోసం వెతికేవాడు. ఇలా ఒంటరిగా పిల్లలు కనిపించగానే వారని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి లైంగిక దాడి చేసి చంపేసేవాడు.

The court found Ravindra Kumar guilty of raping and murdering 30 children

రవీంద్ర పిల్లల కోసం ఒక్కోసారి 40 కిలోమీటర్ల దూరం కూడా నడిచేవాడని పోలీసులు తెలిపారు. పిల్లలకు డబ్బులిచ్చి, చాక్లెట్లు ఇచ్చి మంచిక చేసుకుని ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేసి హత్యే చేవాడని పేర్కొన్నారు. అతని కామానికి 6 ఏళ్లు నుంచి 12 ఏళ్లు పిల్లలు బలయ్యారని పోలీసులు చెప్పారు. రవీంద్ర కుమార్ 2014లో 6 ఏళ్ల చిన్నారిని కిడ్నాప్ చేసి అత్యాచారం చేసి చంపేశాడు. మృతదేహాన్ని సెఫ్టిక్ ట్యాంక్ లో పడేశాడు.

ఈ హత్యపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఢిల్లీలోని రోహిణిలోని సుఖ్‌బీర్ నగర్ బస్టాండ్ దగ్గర నుంచి అతడిని అరెస్ట్ చేశారు. రవీంద్రను పట్టుకునే ముందు, పోలీసులు డజన్ల కొద్దీ CCTV కెమెరాల నుండి ఫుటేజీని తనిఖీ చేశారు. బాలికను కిడ్నాప్ చేసి, శారీరకంగా హింసించి, గొంతు కోసి, సెప్టిక్ ట్యాంక్‌లో పడేశాడని గుర్తించారు. అతడిని విచారించగా విస్తుపోయే నిజలు బయట పడ్డాయి. రవీంద్ర 2008లో ఢిల్లీలోని కర్లా ప్రాంతానికి చెందిన ఓ బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం చేసి హత్య చేశాడు.

అప్పుడు అతన్ని పోలీసులు పట్టుకోలేదు. దీంతో అతను రెచ్చిపోయాడు. అతడు ఎప్పుడూ ఒకే చోట కాకుండా వివిధ ప్రాంతాల్లో పిల్లలను ఎత్తుకెళ్లి లైంగిక వాంఛ తీర్చుకుని హత్య చేసేవాడు. 2015లో ఔటర్ ఢిల్లీ జిల్లా డీసీపీగా ఉన్న విక్రమ్‌జీత్ సింగ్ రవీంద్ర కుమార్ నేరాల గురించి విని షాకయ్యాడు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+