సిట్టింగ్ ఎమ్మెల్యే ఓటు వెయ్యడానికి వీల్లేదు, కోర్టు తీర్పుతో మైండ్ బ్లాక్, అధికార పార్టీ లీడర్ కు !
కర్ణాకలోని ధారవాడ బీజేపీ నేత యోగీష్‌గౌడ్ హత్యకేసులో కోర్టు ఆదేశాలతో నియోజకవర్గానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే వినయ్ కులకర్ణికి ఓటు వేసే అవకాశం లేదు. ఓటు వేసేందుకు అనుమతి కోరిన కాంగ్రెస్ ఎమ్మెల్యే వినయ్ కులకర్ణి పిటిషన్‌ను బెంగళూరు ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు తిరస్కరించింది. ఓటు వెయ్యాలని, ధారవాడలో అడుగు పెట్టాలని ప్రయత్నించిన ఎమ్మెల్యేకి షాక్ తగిలింది.
2023లో కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు, నేడు జరుగుతున్న లోక్‌సభ ఎన్నికలతో సహా రెండు ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఎమ్మెల్యే వినయ్ కులకర్ణికి అవకాశం లేకండా పోయింది. ధారవాడతో పాటు కర్ణాటకలో పద్నాలుగు లోక్‌సభ నియోజకవర్గాలకు ఈరోజు (మంగళవారం) పోలింగ్ జరుగుతోంది. ఇందుకోసం ఈరోజు ఒక్కరోజు మాత్రమే తాను ధారవాడలోకి ప్రవేశించి ఓటు వెయ్యడానికి అవకాశం కల్పించాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే వినయ్ కులకర్ణి కోర్టుకు మనవి చేశారు.

అయితే ఇప్పటికే కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వినయ్ కులకర్ణిపై సుప్రీంకోర్టు కూడా ధారవాడలో అడుగుపెట్టకూడదని ఆంక్షలు విధించింది. లోక్ సభ ఎన్నికల్లో ఓటు వేసేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యే వినయ్ కులకర్ణి అనేక ప్రయత్నాలు చేశారు. అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యే వినయ్ కులకర్ణి చేసిన అన్ని ప్రయత్నాలు విఫలం కావడంతో ఆయన నిరాశచెందారని తెలిసింది. ధారవాడ జిల్లా హెబ్బల్లి జిల్లా పంచాయతీ సభ్యుడు, బీజేపీ నాయకుడు యోగేష్‌గౌడ్ హత్య కేసులో మాజీ మంత్రి వినయ్ కులకర్ణి ప్రధాన నిందితుడు.
ఇదే కేసులో అరెస్టు అయ్యి జైలుకు వెళ్లిన వినయ్ కులకర్ణి షరతులతో కూడిన బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ కేసుకు సంబంధించి మాజీ మంత్రి, సిట్టింగ్ ఎమ్మెల్యే వినయ కులకర్ణికి ఊరట లభించే సూచనలు ఇప్పట్లో కనిపించడం లేదు. కేసు నుంచి బయటపడేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యే వినయ్ కులకర్ణి చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. బీజేపీ నాయకుడు యోగేష్ గౌడ 2016లో హత్యకు గురయ్యాడు,

2016 జూన్ 15వ తేదీన ధారవాడలోని సప్తపుర బరంగేలో జిమ్‌లో యోగేష్‌గౌడ్ హత్యకు గురయ్యాడు. ప్రజాప్రతినిధుల సెషన్స్ కోర్టు విధించిన చార్జిషీట్‌లో అనేక లోపాలున్నాయని, హత్య కేసుకు తనకుఎలాంటి సంబంధం లేదని అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈ కేసులో నిందితుడిగా ఉన్న ధారవాడ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే వినయ్ కులకర్ణి రిట్ పిటిషన్ దాఖలు చేశారు.
ఈ కేసులో వినయ్ కులకర్ణికి వాదనలు విన్న కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి కృష్ణ ఎస్. దీక్షిత్ తీర్పును రిజర్వ్ చేశారు. దాని తీర్పును సోమవారం ప్రకటించారు వినయ్ కులకర్ణి పిటిషన్‌ను కొట్టివేసిన కోర్టు మూడు నెలల్లో వినయ్ కులకర్ణి కేసు విచారణ పూర్తి చేయాలని ప్రజా ప్రతినిధుల కోర్టును ఆదేశించింది. దీంతో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వినయ్ కులకర్ణికి పెద్ద షాక్ తగిలింది. ధారవాడలో అడుగు పెట్టాలని అనేక ప్రయత్నాలు చేసిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వినయ్ కులకర్ణి చివరికి లోక్ సభ ఎన్నికల్లో కూడా ఓటు వెయ్యడానికి అవకాశం చిక్కలేదు
-
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !! -
DA సున్నా?: ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పీక్స్! శాలరీ హైక్ రిపోర్ట్ -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ వరం, ఇక కొత్త రూపు..!!












Click it and Unblock the Notifications