వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చావులో కూడ ప్రకృతి ప్రేమికురాలే..... ముఖ్యమంత్రి అయినా అంత్యక్రియలకు రూ.500 లే ఖర్చు...!

|
Google Oneindia TeluguNews

మూడు సార్లు ముఖ్యమంత్రి, అరవై సంవత్సరాలకు పైగా రాజకీయ అనుభవం ఉన్న నేత ఢిల్లి ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న రాజకీయ కురువృద్దురాలు మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ రెండు రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే...దీంతో ఆమే అంత్యక్రియలు ఢిల్లిలోని అతి పురాతనమైన నిగమ్‌బోధ్ క్రిమేషన్ గ్రౌండ్‌లో ఆదివారం మధ్యహ్నం జరిగాయి...

 రూ.500 లతో అంత్యక్రియలు...

రూ.500 లతో అంత్యక్రియలు...

రాజకీయ ప్రుముఖులు చనిపోయిన తర్వాత వారి అంత్య క్రియల కోసం గంధపు చెక్కలను ఉపయోగిస్తారు. ఇందుకోసం లక్షల రుపాయలను ఖర్చు అడంబరంగా నిర్వహిస్తారు... అయితే షీలా దీక్షీత్ అంత్యక్రియలు మాత్రం ఆమే కోరిక ప్రకారం అడంబరాలకు భిన్నంగా సాదాసీదాగ జరిగాయి.హంగులు ఆర్బాటాలకు పోకుండా నిరాడంభరంగా ముగిశాయి. ఈనేపథ్యంలోనే ఆమే బ్రతికినన్ని రోజులు ప్రకృతి ప్రేమికురాలిగా ఉన్న షీలా దీక్షిత్, చనిపోయిన తర్వాత కూడ తన ఆశయాలకు అనుగుణంగానే అంత్యక్రియలు నిర్వహించాలని కోరారు. ప్రకృతికి హని తలపెట్టకుండా అంత్యక్రియలు చేపట్టాని కోరింది. దీంతో కేవలం 500 రుపాయల ఖర్చుతోనే అంత్యక్రియలు నిర్వహించారు.

గంధపు చెక్కలకు బదులుగా సీఎన్‌జీ పద్దతిలో... దహనం

గంధపు చెక్కలకు బదులుగా సీఎన్‌జీ పద్దతిలో... దహనం

ముఖ్యంగా షీలా దీక్షిత్ ప్రకృతి ప్రేమికురాలు కావడంతో ,మృత్యువు అనంతరం కూడ ప్రజలకు తన చావు ద్వార కాలుష్యాన్ని వెదజల్లే కట్టెలను ఉపయోగించవద్దని కోరిందట... దీంతో అమే అంత్యక్రియలను హిందూ సాంప్రదాయం ప్రకారం గంధపు చెక్కలు, లేదా ఏదేని కట్టేలతో కాకుండా సీఎన్‌జీ పద్దతిలో దహన సంస్కరాలు జరిగాయి. ఈ పద్దతి ద్వార కాలుష్యాన్ని అరికట్టడడంతోపాటు ,ఖర్చు కూడ తగ్గింది. ఈ నేపథ్యంలోనే ఒక మాజీ ముఖ్యమంత్రి అంతిమ దహన సంస్కరాలకు అయిన ఖర్చు కేవలం అయిదు వందలు అయింది. ఇక ఈ పద్దతిలో మృత దేశం కేవలం అర్ధగంటలో బూడిదగా మారింది.

షీలా దీక్షిత్‌ను ఆదర్శంగా తీసుకుంటారా...?

షీలా దీక్షిత్‌ను ఆదర్శంగా తీసుకుంటారా...?

అయితే అయితే షీలా అంత్యక్రియలు ఇలా చేయడాన్ని కొందరు వ్యతిరేకించారు. ఇది హిందూ సంప్రదాయం కాదని దిల్లీలోని కొందరు అర్చకులు అభ్యంతరం తెలిపారు.మొత్తం మీద పలు నగరాల్లో సాధరణ వ్యక్తులు చనిపోయినప్పుడు జరిగే అంత్యక్రియాల్లో కాలుష్యాన్ని వెదజల్లే కారకాలు అనేకం ఉంటాయి. ముఖ్యంగా మెట్రో నగరాల్లో దహన సంస్కరాల ఖర్చు తడిసి మోపడవుతున్న పరిస్థితి. దీంతో పాటు స్మశాన వాటిక చుట్టుపక్కల ఉండే వారికి ఇబ్బందిగా మారింది. మరి షీలా దీక్షీత్ లాంటీ నాయకురాల్లే ఇలాంటీ నిర్ణయాలు తీసుకోవడంతో ఎంత మంది సాధరణ ప్రజల్లో మార్పులు వచ్చి ఆదర్శంగా తీసుకుంటారో వేచి చూడాలి

English summary
Honouring her wish, the cremation of Congress' stalwart Sheila Dikshit done using the CNG method at the city's by using Compressed Natural Gas (CNG) machine installed at Nigam Bodh Ghat oldest cremation ground, Nigambodh Ghat, on Sunday at 2.30pm.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X