ఆయెధ్య రామ మందిరం గుడి ఓపనింగ్ డేట్ ఫిక్స్, ప్రధాని మోదీ 20 ఏళ్ల చాలెంజ్ తో !
లక్నో/అయోధ్య: కోట్లాది మంది హిందూ భక్తుల కల అయిన అయోధ్య రామమందిరం నిర్మాణం పనులు చివరి దశకు చేరుకుని ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్నాయి. 2024 లో జనవరి 15వ తేదీ నుంచి 24వ తేదీలోపు ఆలయ ప్రారంభోత్సవ వేడుకలు నిర్వహించనున్నట్లు రామమందిర నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా తెలిపినట్లు ఏబీపీ న్యూస్ తెలిపింది..
రామమందిరం ప్రారంభోత్సవ వేడుకల చివరి రోజైన జనవరి 24వ తేదీన దేవుడి విగ్రహాల ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొంటారు. ప్రాణ ప్రతిష్ఠ అనంతరం భక్తుల కోసం రామమందిరం తలుపులు తెరుస్తారు. 2024 జనవరి 25వ తేదీ నుంచి సాధారణ భక్తులను ఆయోధ్యలోని రామమందిరం ఆలయ దర్శనానికి అనుమతిస్తామని మిశ్రా తెలిపారు.

గర్భగుడి ప్రధాన ద్వారం బంగారంతో, దానిపై రామాయణం చరిత్ర గురించి తెలిపే వివారాల శిల్పాలు ఉన్నాయి. ఆలయం యొక్క 161 అడుగుల ఎత్తైన గోపురం కూడా బంగారం పూతతో కప్పబడి ఉంటుంది. ఆలయ ప్రాంగణమే కాకుండా శ్రీరామ జన్మభూమి యాత్ర ప్రాంతం అయిన 70 ఎకరాల్లో విస్తరించి ఉంది. అయోధ్యలోని రామమందిరంలో రామ లల్లాను బలరాముని రూపంలో పూజిస్తారు.

ఆలయ శంకుస్థాపన సందర్భంగా మాత్రమే అయోధ్యను సందర్శించాలని గతంలో ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయించారు. తన మాటను నిజం చేస్తూ 20 ఏళ్ల తర్వాత 2021 ఆగస్టు 5న అయోధ్యను సందర్శించిన ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్యలోని రామమందిరం ఆలయానికి శంకుస్థాపన చేశారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ గత వారం 500 ఏళ్లుగా ఎదురుచూస్తున్న రాముడి ఐదేళ్ల రూపంలో రామ లల్లా విగ్రహాన్ని ప్రతిష్టించడం యొక్క ప్రాముఖ్యత గురించి మాట్లాడారు.
ఈ మైలురాయి ప్రపంచ స్థాయిలో అయోధ్య ప్రాముఖ్యతను పెంచుతుందని సీఎం యోగి ఆదిత్యనాథ్ అభిప్రాయపడ్డారు. కోట్లాది మంది హృదయాల్లో అయోధ్యకు లోతైన అనుబంధం ఉందని గుర్తించిన ఆదిత్యనాథ్ ఆలయ నిర్మాణం తన అచంచలమైన భక్తికి, విశ్వాసానికి ప్రతీక అని అన్నారు. మొత్తం మీద అయోధ్యలోని రామమందిరం ప్రారంభోత్సవానికి డేట్ ఫిక్స్ చెయ్యడంతో కోట్లాది మంది రాముడి భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
-
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!!












Click it and Unblock the Notifications