చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వర్షాలు, అమ్మ ‘టీం’నిద్ర: స్వామి (ఫోటోలు)

|
Google Oneindia TeluguNews

చెన్నై: భారీ వర్షాల కారణంగా తమిళనాడు ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారని, అధికారంలో ఉన్న అమ్మ టీం (జయలలిత ప్రభుత్వం) మాత్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదని బీజేపీ సీనియర్ నాయకుడు సుబ్రమణ్యస్వామి మండిపడుతున్నారు.

చెన్నై నగరం దాదాపు మునిగిపోయిందని, రోడ్లు జలమయం అయ్యాయని, పిల్లలు, మహిళలు, వృద్దులు అవస్థలు పడుతున్నారని ఆయన ఆరోపించారు. లోతట్టు ప్రాంతాలు, మురికివాడలు జలమయం అయ్యి డ్రైనేజ్ లు పొంగిపొర్లుతున్నాయని చెప్పారు.

తమిళనాడు ప్రభుత్వం ఆలసత్వం కారణంగా ఇక్కడి ప్రజలు ఇబ్బందులకు గురౌతున్నారని ఆరోపించారు. చెన్నై నగరం వరదల్లో మునిగిపోయింది, అమ్మ డ్రైనేజ్ వ్యవస్థ సక్రమంగా పని చెయ్యడంలేదని వ్యంగంగా సోషల్ మీడియాలో జయలలిత మీద మండిపడ్డారు.

జలమయం

జలమయం

చెన్నై నగరం జలమయం అయ్యింది. డ్రైనేజ్ లు పొంగిపొర్లడంతో మురికినీరు రోడ్ల మీదకు వచ్చింది.

విద్యాసంస్థలకు సెలవు

విద్యాసంస్థలకు సెలవు

భారీ వర్షాల కారణంగా చెన్నై నగరంలోని అన్ని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు.

వ్యాపారాలు బంద్

వ్యాపారాలు బంద్

భారీ వర్షాల కారణంగా ప్రజలు ఇండ్లకే పరిమితం అయ్యారు. వ్యాపార సంస్థలు మూసివేశారు.

రెట్టింపు అయ్యాయి

రెట్టింపు అయ్యాయి

వర్షాల దెబ్బకు నిత్యవసర సరుకుల ధరలకు రెక్కలు వచ్చాయి. పండ్లు, కూరగాయాల ధరలు రెట్టింపు అయ్యాయి.

చుక్కలు కనపడుతున్నాయి

చుక్కలు కనపడుతున్నాయి

చెన్నై నగరం నీట మునిగింది. అక్కడి కార్పొరేషన్ అధికారులు, సిబ్బందికి చుక్కలు కనపడుతున్నాయి.

59 మంది మృతి

59 మంది మృతి

తమిళనాడులో భారీ వర్షాల కారణంగా వివిద ప్రాంతాలలో ఆదివారం సాయంత్రం 6 గంటల వరకు 59 మంది మరణించారని ప్రభుత్వం తెలిపింది.

సహాయక చర్యలు

సహాయక చర్యలు

భారీ వర్షాల కారణంగా జలమయం అయిన ప్రాంతాలలో సహాయక చర్యలు చేపట్టామని అధికారులు తెలిపారు.

జాలర్లకు హెచ్చరిక

జాలర్లకు హెచ్చరిక

సముద్రంలో చేపలు పట్టడానికి ఎవ్వరూ వెళ్లరాదని ప్రభుత్వం హెచ్చరించింది.

English summary
Heavy rain would occur at a few places over Tamil Nadu, as the death toll from rain-related incidents climbed to 59.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X