వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్నికల కమిషన్ నిర్ణయం: పన్నీర్ సెల్వంకు గట్టి ఎదురు దెబ్బ!

రెండాకుల చిహ్నం కేటాయించే విషయంలో తాజాగా ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయంతో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వర్గానికి గట్టి ఎదురు దెబ్బ పడింది.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: అన్నాడీఎంకే పార్టీ, రెండాకుల చిహ్నం విషయంలో పోటీ పడుతున్న పన్నీర్ సెల్వం, శశికళ వర్గాలకు ఎన్నికల కమిషన్ కొంత సమయం ఇచ్చింది. ఆ సమయంలోపు ఇరు వర్గాలు వారి దగ్గర ఉన్న పత్రాలు సమర్పించాలని ఎన్నికల కమిషన్ సూచించింది.

రెండాకుల చిహ్నం మాకే కేటాయించాలని శశికళ వర్గం, పన్నీర్ సెల్వం వర్గం వేర్వేరుగా ఎన్నికల కమిషన్ ముందు మనవి చేశాయి. ఆర్ కే నగర్ ఉప ఎన్నికల సందర్బంగా రెండాకుల చిహ్నం కోసం రెండు వర్గాలు ఎన్నికల కమిషన్ ముందు పోటీపడ్డాయి.

ఆరోజు ఇస్తారని

ఆరోజు ఇస్తారని

పన్నీర్ సెల్వం, శశికళ వర్గం వాదనలు విన్న ఎన్నికల కమిషన్ ఎవరికో ఒకరికి రెండాకుల చిహ్నం కేటాయించాలని నిర్ణయించారు. ఏప్రిల్ 17వ తేదీ ఏదో ఒక వర్గానికి అన్నాడీఎంకే పార్టీ రెండాకుల చిహ్నం కేటాయిస్తారని భావించారు.

టైం ఇవ్వండి

టైం ఇవ్వండి

ఇటీవల అన్ని పత్రాలు సమర్పించడానికి మాకు ఇంకా సమయం కావాలని టీటీవీ దినకరన్ ఎన్నికల కమిషన్ కు మనవి చేశాడు. 8 వారాల సమయం ఇస్తే మీరు అడిగిన అన్ని పత్రాలు సమర్పించుకుంటామని దినకరన్ ఎన్నికల కమిషన్ అధికారులకు మనవి చేశారు.

10 లక్ష మందితో

10 లక్ష మందితో

తమిళనాడులోని అన్ని జిల్లాల్లోని శశికళ వర్గంలోని నాయకులతో మాట్లాడిన టీటీవీ దినకరన్ మనకు మద్దతుగా సుమారు 10 లక్షల మంది కార్యకర్తల దగ్గర సంతకాలు చేయించాలని ఆదేశాలు జారీ చేశారు.

ఎంత డబ్బులు ఇస్తారో చెప్పండి

ఎంత డబ్బులు ఇస్తారో చెప్పండి

అన్నాడీఎంకే పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు సంతకాల సేకరణ చేయించాలని టీటీవీ దినకరన్ సూచించారు. అయితే అప్పటికే ఆర్ కే నగర్ ఉప ఎన్నికల సందర్బంగా స్థానిక ఓటర్లకు రూ. 89 కోట్ల వరకు నగదు బట్వాడా చేశారని వెలుగు చూసింది.

ఎదురు తిరిగిన కార్యకర్తలు

ఎదురు తిరిగిన కార్యకర్తలు

మీకు మద్దతుగా సంతకాలు చేస్తే ఎంత మొత్తంలో డబ్బులు ఇస్తారు అని కార్యకర్తలు ఎదురుతిరిగారు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎవ్వరూ సంతకాలు చెయ్యరని నాయకులు దినకరన్ కు తేల్చి చెప్పారు.

టైం ఇవ్వరాదని పన్నీర్ వర్గం

టైం ఇవ్వరాదని పన్నీర్ వర్గం

టీటీవీ దినకరన్ కు ఎక్కువ సమయం ఇస్తే లేనిపోని సమస్యలు తీసుకు వచ్చే అవకాశం ఉందని గుర్తించిన పన్నీర్ సెల్వం వర్గం అసలైన అన్నాడీఎంకే పార్టీ మాదే అంటూ ఎన్నికల కమిషన్ ముందు మనవి చేసింది. శశికళ వర్గానికి ఎక్కువ సమయం ఇవ్వరాదని పన్నీర్ సెల్వం వర్గం డిమాండ్ చేసింది.

పన్నీర్ వర్గానికి షాక్

పన్నీర్ వర్గానికి షాక్

జూన్ 16వ తేది లోపు అన్నాడీఎంకే పార్టీలోని రెండు వర్గాలు ఎందుకు మీకే రెండాకుల చిహ్నం కేటాయించాలి, మీకు ఉన్న మద్దతు ఏమిటీ అని దృవీకరించే పత్రాలతో పాటు అఫిడివిట్ సమర్పించాలని ఎన్నికల కమిషన్ కు సూచించింది. శశికళ వర్గానికి సమయం ఎక్కువ చిక్కడంతో పన్నీర్ సెల్వం వర్గానికి గట్టిదెబ్బ పడింది.

English summary
The Election Commission has given time till June 16 for the two factions in the AIADMK to submit the documents and affidavits supporting two leaves symbol.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X