శశికళ పదవి రద్దు, తంబిదురై దద్దమ్మ: పన్నీర్ సెల్వం
చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు ద్రోహం చేసిన శశికళను దేవుడు కూడా క్షమించడని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం మండిపడ్డారు. త్వరలో శశికళకు సరైన బుద్ది చెబుతామని ఆయన హెచ్చరించారు.
అన్నాడీఎంకే పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఉన్న శశికళ ఎన్నికను భారత ఎన్నికల సంఘం త్వరలో రద్దు చేస్తుందని పన్నీర్ సెల్వం జోస్యం చెప్పారు. అన్నాడీఎంకే పార్టీకి, జయలలితకు నిజమైన వారసులు తామే అని పన్నీర్ సెల్వం, ఆయన వర్గీయులు అంటున్నారు.

ఇదే సమయంలో పన్నీర్ సెల్వం లోక్ సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురై మీద విరుచుకుపడ్డారు. అన్నాడీఎంకే పార్టీలో ఎవరైనా చేతగాని నాయకుడు ఉన్నారంటే అది ఒక్క తంబిదురై మాత్రమే, ఆయన ఒక దద్దమ్మ అంటూ ఎద్దేవ చేశారు.
తంబిదురై లాంటి నాయకులు ఉన్నందు వలనే ఇప్పుడు శశికళను పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నారని, ఆమెను తమిళనాడు ముఖ్యమంత్రిని చేసి ఇక్కడి ప్రజల జీవితాలతో చెలగాటం ఆడటానికి ప్రయత్నించారని విరుచుకుపడ్డారు. ఇదే సమయంలో ఎడప్పాడి పళనిసామి ఎన్ని రోజులు ముఖ్యమంత్రిగా ఉంటారో మీరే చూస్తారు కదా ? అంటూ పన్నీర్ సెల్వం ఆయన మద్దతుదారులతో అన్నారు.












Click it and Unblock the Notifications