కరెంట్ షాక్ అంటే ఇదే, ఇంటికి రూ. 7. 70 లక్షల కరెంట్ బిల్ ఇచ్చేశారు, బీపీ, షుగర్ !

బెంగళూరు/మంగళూరు: కర్ణాటకలో ఇప్పుడు ఉచిత విద్యుత్ స్కీమ్ పై వాడివేడిగా చర్చ జరుగుతోంది. ఇప్పటికే కర్ణాటక ప్రభుత్వం విద్యుత్ చార్జీలు పెంచేసిందని ప్రతిపక్షాలు, ప్రజలు ఆరోపిస్తున్నారు. ఉచిత విద్యుత్ ఇస్తామని ప్రజలకు హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఈ చార్జీలు, ఆ చార్జీలు అంటూ వేల రూపాయల కరెంట్ బిల్లులు చేతిలో పెడుతున్నారని బెంగళూరుతో పాటు పలు నగరాల్లో, పట్టణాలు, గ్రామాల్లో ప్రజలు మండిపడుతున్నారు.

కర్ణాటక ప్రభుత్వం గృహజ్యోతి స్కీమ్ కింద రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్‌ను ప్రకటించింది. ఇదిలా ఉండగా ఈ నెలలో వచ్చిన కరెంటు బిల్లులు చూసిన ప్రజలు హడలిపోతున్నారు. అధికంగా కరెంటు బిల్లులు వచ్చాయని, ఈ ఖరీదైన కరెంటు బిల్లు కట్టకుండా కొంత మంది మొండికేస్తున్నారని ఫిర్యాదులు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో బీజేపీ నాయకులు సిద్దరామయ్య ప్రభుత్వం మీద మండిపడుతున్నారు.

The electricity department gave a current bill of 7 lakh rupees 70 thousand for a house in Mangaluru

ఇలాంటి రామాయణాలు జరుగుతున్న సమయంలో మంగళూరులో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. మంగళూరులోని ఉల్లాళలో నివాసం ఉంటున్న ఓ వ్యక్తి ఇంటికి 7 లక్షల రూపాయలకు పైగా కరెంటు బిల్లు వచ్చింది. ఊహకు అందని రూ.7 లక్షల కరెంటు బిల్లు రావడంతో ఇంటి యజమాని అవాక్కయ్యాడు. అయితే ఇంటి యజమాని గట్టోడిలా ఉన్నాడు. కరెంట్ బిల్లు చూసిన షాక్ అతనికి బీపీ, షుగర్ లెయ్యకపోవడంతో అతను కూల్ గా డీల్ చేశాడు.

ఉల్లాళ బైలుకు చెందిన సదాశివ ఆచార్యకు రూ.7,71,072 విద్యుత్ బిల్లు వచ్చింది. గతంలో నెలకు దాదాపు రూ.3 వేల వరకు కరెంటు బిల్లు వచ్చేదని సదాశివ ఆచార్య చెప్పాడు. అదే విధంగా మెస్కామ్‌కు చెందిన కాంట్రాక్టు సంస్థ మీటర్ రీడర్ ఈ నెల సదాశివ ఆచార్య ఇంటికి వచ్చి బిల్లు ఇచ్చాడు. అయితే బిల్లు మొత్తాన్ని గమనించిన ఇంటి యజమాని షాక్‌కు గురయ్యాడు.

రూ. 7 లక్షల కరెంటు బిల్లు చూసి సదాశివ ఆచార్య వెంటనే రీడర్‌ని ఏమిటి ఇది అని అడిగారు. మీరు కార్యాలయానికి వెళ్లి అక్కడి సిబ్బందిని విచారించాలని చెప్పిన రీడర్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇంట్లో 99, 338 యూనిట్ల విద్యుత్తు వినియోగం జరిగిందని రీగింగ్ చూపించారు. అయితే ప్రతినెలా రూ. 3 వేలు బిల్లు వస్తోందని సదాశివ ఆచార్య మెస్కామ్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.

The electricity department gave a current bill of 7 lakh rupees 70 thousand for a house in Mangaluru

విద్యుత్ బిల్లు రశీదులో 99,338 యూనిట్లు ఖర్చు చేయగా రూ.7,71,072 బిల్లు వచ్చింది. సదాశివ ఆచార్య మెస్కామ్ చెంబుగుడ్డె శాఖకు వెళ్లి సమాచారం ఇవ్వడంతో అధికారులు వెంటనే స్పందించి రివైజ్డ్ బిల్లును జారీ చేశారు. ఉల్లాళ మెస్కామ్ సబ్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ దయానంద స్థానిక మీడియాతో మాట్లాడుతూ ఏజెన్సీల ద్వారా విద్యుత్ బిల్లుల వసూళ్లు జరుగుతున్నాయని అన్నారు.

బిల్ రీడర్ నిర్లక్షం కారణంగా కరెంటు బిల్లును తప్పుగా ప్రింట్ చేస్తున్నారు. బిల్లులో పొరపాటు కనిపిస్తే వినియోగదారునికి ఇవ్వకూడదని అన్నారు. చివరికి రూ. 2,833 రూపాయల రివైజ్డ్ బిల్లు సదాశివ ఆచార్య ఇంటి వద్దకు పంపించారు. ఒక ఇంటికి రూ. 7 లక్షలకు పైగా కరెంట్ బిల్లు రావడంతో మంగళూరు ప్రజలు ఉలిక్కిపడ్డారు. సదాశివ ఆచార్య చదువుకున్నోడు కాబట్టి అధికారుల చుట్టూ తిరిగి సమస్య పరిష్కరించుకున్నారు. అయితే సామాన్య ప్రజల విద్యుత్ బిల్లుల్లో ఒక్కొ ఇంటికి వందల్లో గోల్ మాల్ జరిగినా విద్యుత్ శాఖకు ప్రతినె వేల కోట్లలో నిధులు చేరుతాయని ప్రజలు ఆరోపిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+