Ex employees: ఉద్యోగం నుంచి తొలగించారని ఫ్యాక్టరీ ఓనర్లను చంపిన ఉద్యోగులు !
సూరత్/ అహమ్మదాబాద్: ఉద్యోగంలో నుంచి తీసేశారని కోపంతో ఫ్యాక్టరీ యజమాని, ఆయన తండ్రిని, వారి బంధువును దారుణంగా హత్య చేశారు. ఆన్ లైన్ లో కత్తులు ఆర్డర్ ఇచ్చి వాటిని తెప్పించుకున్న మాజీ ఉద్యోగులు వారి యజమానితో సహ ముగ్గురిని ఒకేసారి హత్య చెయ్యడం కలకలం రేపింది. గుజరాత్ లో ఫ్యాక్టరీలు ఎక్కువగా ఉండే సూరత్ లో ఈ దారుణం జరిగింది.
గుజరాత్ రాష్ట్రంలోని ప్రధాన పారిశ్రామిక కేంద్రంగా సూరత్ పేరు తెచ్చుకుంది. కల్పేష్ ధోలాకియా అలియాస్ కల్పేష్ సూరత్ లోని అమ్రోలిలో స్పిన్నింగ్ మిల్లు నడుపుతున్నాడు. ఈ ప్లాంట్‌లో ఉత్తరప్రదేశ్, ఒడిశా తదితర రాష్ట్రాలకు చెందిన వారు కార్మికులుగా పనిచేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం ఒడిశాకు చెందిన ఇద్దరు యువకులు ఈ ఫ్యాక్టరీలో నైట్ డ్యూటీ చేశారు.

ఇద్దరూ సరిగా పని చేయకుండా నిద్రపోవడం ఫ్యాక్టరీ యజమాని కల్పేష్ గమనించాడు. ఆ సందర్బంలో ఫ్యాక్టరీ యజమాని కల్పేష్ కార్మికులు ఇద్దరినీ విచారించారు. ఆ సందర్బంలో వాగ్వాదం జరగడంతో కల్పేష్ వారిద్దరినీ ఉద్యోగంలో నుంచి తొలగించాడు. దీంతో ఇద్దరికీ కోపం వచ్చి కంపెనీ యాజమాన్యంపై పగ తీర్చుకోవాలని ప్లాన్ వేశారు. ఫ్యాక్టరీకి వెళ్లిన ఇద్దరు కార్మికులు యాజమాని కల్పేష్ ను కలుస్తామని సెక్యూరిటీ గార్డుకు చెప్పారు.
ఫ్యాక్టరీ లోపలికి వెళ్లిన ఇద్దరు కార్మికులు కల్పేష్ మీద పదునైన ఆయుధాలతో దాడి చేశారు. ఈ సంఘటన జరిగిన సమయంలో యజమాని కల్పేష్ తండ్రి తంజి, అతని బంధువు గన్ శ్యామ్ అడ్డుపడ్డారు. ఆ సందర్బంలో తంజి, గన్ శ్యామ్ మీద నిందితులు దాడి చేసి ముగ్గురిని కత్తులతో పొడిచేసి అక్కడి నుంచి తప్పించుకున్నారు. ఈ దాడిలో యజమాని కల్పేష్, అతని తండ్రి తాంజి మరియు అతని బంధువు గన్ శ్యామ్ తీవ్రంగా గాయపడి మరణించారు. సీసీటీవీ ఫుటేజీల సహాయంతో హంతకులను పోలీసులు పట్టుకున్నారు. ఉద్యోగంలో నుంచి తొలగించారని ఫ్యాక్టరీ యజమానులను హత్య చెయ్యడం సూరత్ లో కలకలం రేపింది.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications