డోలాయమానంగా యూఎస్ లో భారతీయ విద్యార్ధుల భవిత
అమెరికాలో చదువుకుంటున్న భారతీయ విద్యార్థులకు, తెలుగు విద్యార్థులకు ఓ పి టి అనేది ఒక ముఖ్యమైన అంశం. ఇది చదువు పూర్తిచేసిన తర్వాత అమెరికాలో కొంతకాలం ఉద్యోగం వెతుక్కోవడానికి, పనిచేయడానికి వీలు కల్పించే అవకాశం. అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం పూర్తిచేసి, అక్కడ కంపెనీలలో వృత్తిపరమైన అనుభవం పొందడానికి ఉపకరించే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ విషయంలో ప్రస్తుతం అక్కడ డిగ్రీ పూర్తయిన విద్యార్థులు ఓపిటి వస్తుందా రాదా అన్న ఆందోళనలో ఉన్నారు.
2024లో ఓపీటీలో మన వాళ్ళే టాప్
2024లో కూడా ఎఫ్ ఎన్ వీసా పైన అమెరికాలో ఉన్న విదేశీ విద్యార్థులు డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ఓ పి టి కింద అనేక కంపెనీలలో పనిచేస్తున్నారు. స్టెమ్ ఓ పి టి ని పొడిగించుకునేందుకు 2024లో 95,384 మంది అనుమతి పొందారు. అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలలో ఓ పి టి అవకాశాన్ని పొంది తమ కెరీర్ ను బిల్డ్ చేసుకుంటున్న విద్యార్థులు ఎంతో మంది ఉన్నారు.

ఆందోళనలో భారతీయ విద్యార్థులు
ఇప్పటివరకు ఓపిటి విభాగంలో, స్టెమ్ కోర్సులలో అత్యధిక భాగం అవకాశం దక్కించుకున్న మనవాళ్లకు, ప్రస్తుతం అమెరికాలోని తాజాపరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. చాలా యూనివర్సిటీలలో తాజాగా సెమిస్టర్ పూర్తిచేసుకుని కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు ఓపిటి వస్తుందా రాదా అన్నది ఆందోళన కలిగిస్తున్న అంశం. ఇటీవల కాలంలో ఓపిటి పైన ఆంక్షలు, రద్దు ప్రతిపాదనలు వంటి అనేక వార్తలు ప్రస్తుతం ఓపిటి కోసం అప్లై చేసిన విద్యార్థులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.
ఓపిటి విషయంలో గందరగోళం
అమెరికా ప్రభుత్వం ఓపిటి నిబంధనలను కఠినతరం చేసినా, లేదా రద్దు చేసినా పరిస్థితి దారుణంగా మారుతుందని వారు లబోదిబోమంటున్నారు. ఓపిటిపై ఆధారపడి చదువుతున్న వేలాది మంది భారతీయ విద్యార్థులు ట్రంప్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, అవలంబిస్తున్న విధానాలతో ఆందోళనకు అవుతున్నారు. ఎడ్యుకేషనల్ లోన్స్ తీసుకుని, యూఎస్ వెళ్లి చదువుకున్న వారంతా ఓపిటి వస్తే ఉద్యోగాలు వెతుక్కొని, తమకు వచ్చిన ఉద్యోగాలతో తాము తీసుకున్న ఎడ్యుకేషనల్ లోన్స్ తీర్చాలని భావిస్తారు.
క్లారిటీ లేక స్టూడెంట్స్ స్థితి డోలాయమానం
కానీ ట్రంప్ సర్కార్ ఆలోచనా ధోరణితో ఎప్పుడు ఏం నిర్ణయం తీసుకుంటారో తెలియని పరిస్థితిలో ఓ పి టి రాకుంటే ఎడ్యుకేషనల్ లోన్స్ ఎలా తీరుస్తామని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికి ఎటువంటి క్లారిటీ లేక డోలాయమాన స్థితిలో అనేక యూనివర్సిటీల విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు.












Click it and Unblock the Notifications