ఆర్డినెన్స్ వెనక్కి పంపించిన గవర్నర్, సీఎం షాక్, ఆ సంఘాలు ఫైర్, ఏం జరిగిందంటే?

కర్ణాటకలో కన్నడ బోర్డులు తప్పనిసరి అనే చట్టం ఆర్డినెన్స్‌ను ఆ రాష్ట్ర గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ ఉపసంహరించుకున్నారు. గవర్నర్ నిర్ణయాన్ని కన్నడ సంఘాలు ఖండించాయి. రాష్ట్ర ప్రభుత్వం 60% కన్నడ కలిగి ఉండాల్సిన దుకాణాలు, కంపెనీలు, మాల్స్ నేమ్ బోర్డు మార్చడానికి ఫిబ్రవరి 28వ తేదీ వరకు గడువు ఇచ్చింది. అయితే కర్ణాటక గవర్నర్ నిర్ణయంతో కన్నడ సంఘాలు మండిపడుతున్నాయి.

కర్ణాటక ప్రభుత్వం కన్నడ బోర్డులు తప్పనిసరి అని నిర్ణయం తీసుకుని గవర్నర్ ఆమోదం కోసం ఎదరు చూసింది. ఈ మేరకు గవర్నర్ సంతకం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌ను పంపింది. అయితే ఈ ఆర్డినెన్స్‌పై కర్ణాటక గవర్నర్ సంతకం చేయకుండా వెనక్కి పంపారు. దీనిపై కర్ణాటక డీసీఎం డీకే శివకుమార్ స్పందించారు. మంత్రివర్గ సమావేశంలో ఏకగ్రీవ తీర్మాణం తీసుకున్నామని, కన్నడ భాషను, కన్నడ సంస్కృతిని కాపాడుకోవడం మన కర్తవ్యం అని, పౌరులు, వ్యాపారులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఈ చట్టం చేశామని అన్నారు.

 The governor who sent back the Karnataka Bhutvam Ordinance to set up Kannada boards

ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని గవర్నర్ ఎందుకు వెనక్కి పంపారో తెలియడం లేదని కర్ణాటక డీసీఎం డీకే శివకుమార్ అన్నారు.కర్ణాటక రాష్ట్రం కోసం ఈ బిల్లును తీసుకొచ్చామని, ఎవరూ అభ్యంతరం చెప్పలేదని, ఈ బిల్లు ఆమోదాన్ని మరోసారి పరిశీలించాల్సిందిగా గవర్నర్‌ను కోరతామని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మీడియాకు చెప్పారు.

ఈ విషయంపై కర్ణాటక మాజీ డీసీఎం, బీజేపీ సీనియర్ నాయకుడు అశ్వత్‌నారాయణ మాట్లాడుతూ ఆర్డినెన్స్‌లో ఏముందో మాకు తెలియదని అన్నారు. గవర్నర్ ఈ ఆర్డినెన్స్ ఎందుకు వెనక్కి పంపారో మాకు తెలియదని, ఆర్డినెన్స్‌పై పూర్తి సమాచారం తెలుసుకుని మాట్లాడతామని మాజీ డీసీఎం, బీజేపీ సీనియర్ నాయకుడు అశ్వథ్ నారాయణ మీడియాకు చెప్పారు.

 The governor who sent back the Karnataka Bhutvam Ordinance to set up Kannada boards

దీనిపై సమావేశంలోనూ చర్చిస్తామని, దీనిపై ప్రభుత్వం స్పష్టతనివ్వాలని ఆయన అన్నారు. సిద్దరామయ్య ప్రభుత్వం ఈ ఆర్డినెన్స్‌ను మాకు చూపలేదని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు.

జయదేవ్ డైరెక్టర్ డాక్టర్ మంజునాథ్ పదవీ కాలం నేటితో ముగియనున్న నేపథ్యంలో ఆ ఆసుపత్రి డైరెక్టర్ ఎంపిక త్వరలో జరగనుంది. జయదేవ ఆసుపత్రి కొత్త డైరెక్టర్ ఎంపిక విషయంలో కర్ణాటక సీఎం సిద్దరామయ్య అధికారిక కార్యాలయం కృష్ణాలో బుధవారం జరగాల్సిన సమావేశం వాయిదా పడింది. జయదేవ ఆసుపత్రి డైరెక్టర్ ఎంపిక కమిటీ చైర్మన్‌గా ఉన్న సీఎం సిద్ధరామయ్య సమావేశాన్ని పిలిచి తుది నిర్ణయం తీసుకోనున్నారు. డైరెక్టర్‌గా మైసూర్ జయదేవ ఆసుపత్రికి చెందిన ఎంఎస్ సదానంద ఎంపికయ్యే అవకాశం ఉందని కన్నడ మీడియా అంటోంది. బెంగళూరులోని జయదేవ ఆసుపత్రికి దేశ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉన్న విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+