శోభనం గదిలో పెళ్లికొడుకు ఆత్మహత్య, పాల గ్లాస్ తో వెళ్లిన పెళ్లికూతురు ? అసలు మ్యాటర్ ??
వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా జీవించాలి అని ఇరువైపుల కుటుంబ సభ్యులు అనుకున్నారు. పెళ్లి కూడా చాలా గ్రాండ్ గా జరిగింది. పెళ్లికి వచ్చిన బంధువులు సైతం పెళ్లిరోజు సందడి చేశారు. పెళ్లి రోజు పెళ్లి కూతురు పాల గ్లాస్ తో బెడ్ రూమ్ దగ్గరకు వెళ్లింది. అంతే అక్కడ సీన్ చూసిన పెళ్లికూతురు బిత్తరపోయింది. కుటుంబ సభ్యులు శోభనం గదిలోకి వెళ్లి చూడగా పెళ్లికొడుకు ఫ్యాన్ కు ఉరి వేసుకుని వేలాడుతూ ఉన్నాడు.
ఉత్తరప్రదేశ్‌లోని ఇటావా జిల్లాలో కొత్తగా పెళ్లి చేసుకున్న యువకుడు ఫస్ట్ నైట్ ఆత్మహత్య చేసుకున్నాడు. పుట్టింటికి వీడ్కోలు పలుకుతూ భర్త ఇంటికి చేరిన యువతి అదే రోజు రాత్రి భర్త ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నవ వరుడు ఆత్మహత్యతో ఇరు కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. కొత్త జీవితంపై ఆశతో భర్త ఇంటికి వచ్చిన భార్య శోభనం గదిలో భర్త ఆత్మహత్య చేసకున్న సంఘటన చూసి చలించిపోయింది.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆత్మహత్యకు గల కారణాలను పోలీసులు విచారించి ఇరువురి కుటుంబ సభ్యులను విచారిస్తున్నారు.
ఈ ఘటన మొత్తం ఇటావా పోలీస్ స్టేషన్‌లోని ఉష్రాహర్ ప్రాంతంలో జరిగింది. విశ్రాంత సైనికుడు గన్‌సింగ్ చిన్న కుమారుడు సత్యేంద్ర వివాహానికి ముందే అంటే జులై 2న గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు. రాత్రంతా ఘనంగా బ్యాండ్ బాజా నిర్వహించారు.
ఆ తర్వాత ఆచార వ్యవహారాల ప్రకారం సత్యేంద్ర వివాహం జరిగింది. జూలై 3వ తేదీన వధువు స్వగ్రామంలో జరగింది. తరువాత పెళ్లి కూతురు ఊరిలో కూడా పెళ్లి కొడుకు సత్యేంద్రను గ్రాండ్ గా బాజా భజంత్రీలతో ఊరేగింపు చేశారు. ఆ ఊరేగింపు పూర్తి అయిన తరువాత భర్త సత్యేంద్ర ఇంటికి అతని భార్య వచ్చింది.
సాయంత్రం వరుడి ఇంట్లో గ్రాండ్‌గా డీజే కార్యక్రమాన్ని నిర్వహించారు. వరుడు సత్యేంద్ర స్నేహితులు కూడా వరుడితో కలిసి డ్యాన్స్ లు వేస్తూ పెళ్లి వేడుకలు జరుపుకున్నారు.
ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత వరుడు సత్యేంద్ర స్వయంగా డీజేకి డబ్బులు ఇచ్చాడు. అయితే, ఈ ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు. సత్యేంద్ర మొదటి రాత్రికి సిద్ధమవుతున్న సమయంలో అతని ఇంటి రెండవ అంతస్తులో శోభనం కోసం సింగారించిన గదిలోకి వెళ్లి ఉరివేసుకున్నాడు.
పాల గ్లాసు తీసుకుని గదిలోకి వచ్చిన పెళ్లికూతురు ఎన్నిసార్లు తలుపు తట్టినా పెళ్లికోడుకు సత్యేంద్ర తలుపు తీయలేదు. అనుమానం వచ్చి కిటికీలోంచి చూడగా సత్యేంద్ర ఆత్మహత్యకు పాల్పడిన విషయం వెలుగు చూసింది.

వెంటనే తలుపులు పగులగొట్టి సత్యేంద్రను ఆసుపత్రిలో చేర్పించారు. అప్పటికే సత్యేంద్ర చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. సత్యేంద్ర చనిపోయాడని తెిసిన తర్వాత, వరుడి ఇంట్లో తీవ్ర విషాదం ఆవరించింది. వధువు తన భర్త సత్యేంద్ర ముఖం కూడా సరిగ్గా చూడలేదు. పెళ్లి వేడుకల ఇల్లు సత్యేంద్ర క్షణికావేశంతో మృత్యు గృహంగా మారిపోయింది.
'
ఇప్పటి వరకు సత్యేంద్ర ఆత్మహత్యకు గల కారణాలు తెలియడం లేదని పోలీసులకు తెలిపారు.
వివాహ కార్యక్రమానికి కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా అతిథులంతా ఆనందంగా కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే సత్యేంద్ర ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో అర్థం కావడం లేదన్నారు.
శివారా గ్రామం ఉసర్హర్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (రూరల్), సత్యపాల్ సింగ్ తెలిపారు. కేసు విచారణలో ఉందని పోలీసులు తెలిపారు.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ?












Click it and Unblock the Notifications