ఎంత చెప్పినా మారలేదు, భార్యను చంపేసి ఆలోచించాడు, క్లైమాక్స్ లో భర్త ఏం చేశాడు !
చెన్నై/కోయంబత్తూరు: వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చెయ్యడంతో ఇద్దరు కుమార్తెలు పుట్టారు. భార్య, ఇద్దరు కుమార్తెలతో కలిసి అతను చాలా హ్యాపీగా కాలం గడిపాడు. అయితే ఇటీవల దంపతుల మధ్య గొడవలు ఎక్కువ అయ్యాయి. పదేపదే దంపతులు గొడవపడుతున్నారు. చివరికి ఫామ్ హౌస్ లో భార్యను హత్య చేశాడు. భార్యను చంపేసిన తరువాత ఆమె భర్త ఆలోచించాడు.
తమిళనాడులోని పొల్లాచ్చి సమీపంలో మనస్పర్థల కారణంగా భార్యను హత్య చేసి భర్త ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది. కోయంబత్తూర్‌లో జిల్లాలోని పొల్లాచ్చి జమీన్ ఊతుకులి ప్రాంతంలోని ప్రైవేట్ యాజమాన్యంలోని ఫామ్ హౌస్ లో కాళీముత్తు, అతని భార్య రాజేశ్వరి మెయింటెనెన్స్ పనులు చేస్తున్నారు.

ఇద్దరూ అదే ఫామ్ హౌస్ లోని ఇంట్లో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో రాజేశ్వరి గత 9 నెలలు క్రితం కోయంబత్తూరులో నివాసం ఉంటున్న కూతురు కవితా మణి ఇంటికి వెళ్లి ఆమెతో కలిసి అక్కడే నివసిస్తోంది. ఈ క్రమంలో రాజేశ్వరి ఆ ప్రాంతంలోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో అసిస్టెంట్‌గా పని చెయ్యడం మొదలుపెట్టింది.
కోయంబత్తూరులోని తన కుమార్తె ఇంటికి వెళ్లి భర్త కాళీముత్తును జమీన్ ఉత్తుకుళి ప్రాంతంలోని ఫామ్ హౌస్ కు రావాలని అతని భార్య రాజేశ్వరికి మనవి చేశారు. రెండు మూడు రోజుల పాటు చర్చలు జరిపిన తరువాత కూతురు కవితా మణి కూడా ఆమె తల్లి రాజేశ్వరిని తండ్రి కాళిముత్తులో కలిసి వెళ్లాలని చెప్పింది. తరువాత కాళిముత్తు, రాజేశ్వరి ఫామ్ హౌస్ లోని ఇంటికి వెళ్లారు.
ఉదయం చాలా సేపటి వరకు కాళిముత్తు, రాజేశ్వరి దంపతులు నివాసం ఉంటున్న ఇంటి తలుపులు తెరవకపోవడంతో అదే ఫామ్ హౌస్ లో తోటలో పని చేస్తున్న మరికొందరు ఆ ఇంటికి వెళ్లి చూశారు. ఆ సందర్బంలో కాళీముత్తు ఉరివేసుకుని ఉండటాన్ని, అతని భార్య రాజేశ్వరి మంచం మీద శవమై పడి ఉండటాన్ని చూసి హడలిపోయి వెంటనే వెస్ట్ పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించారు.

పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతి చెందిన కాళీముత్తు తరచూ లాటరీ టిక్కెట్లు ఎక్కువగా కొనుగోలు చేసేవాడని, మద్యం సేవించేవాడని, వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని. ఇదే విషయంలో డబ్బులు మొత్తం ఖర్చు చేసేవాడని, దీంతో భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తాయని తెలిసింది.
దీంతో కోపంతో కూతురు ఇంటికి రాజేశ్వరి వెళ్లిందని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. ఇదే విషయంలో రాత్రి మళ్లీ కాళిముత్తు, రాజేశ్వరి దంపతుల మధ్య ఇదే విషయంలో వాగ్వాదం జరిగింది. భర్త కాళిముత్తు అతని భార్య రాజేశ్వరి ముఖాన్ని దిండుతో నొక్కి ఊపిరిరాకుండా చేసి ఆమెను హత్య చేసిన తరువాత కాళిముత్తు అయోమయంలో పడిపోయాడు.
పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపిస్తారనే భయంతో కాళిముత్తు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. దీంతో పొల్లాచ్చి వెస్ట్ పోలీస్ స్టేషన్ పోలీసులు రెండు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం కోయంబత్తూరులోని ఈఎస్‌ఐ ఆస్పత్రికి తరలించారు. కాళిముత్తు, రాజేశ్వరి బంధువులను విచారిస్తున్నామని పొల్లాచ్చి పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications