భార్య అందం చూసి తట్టుకోలేకపోయాడు, ఫ్రెండ్స్ తో కలిసి ఏం చేశాడంటే ?
కుటుంబ కలహాలతో నాకు విడాకులు ఇస్తే నేను వేరే జీవితం చూసుకుంటానని భార్య ఆమె భర్తకు చెప్పింది. అందంగా తయారు అవుతున్న భార్యను చూసి ఆమె భర్త తట్టుకోలేకపోయాడు. దంపతులు విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు. దంపతులు ఇద్దరూ కోర్టు విచారణకు హాజరౌతున్నారు. తన భార్యకు అక్రమ సంబంధం ఉందని భర్తకు విపరీతమైన అనుమానం ఉంది.
భార్యను నమ్మించి గుడికి తీసుకెళ్లిన భర్త ఆమెను హత్య చేసిన ఘటన కర్ణాటకోని రామనగర జిల్లాలో చోటుచేసుకుంది.
కుటుంబ కలహాలతో రామనగర జిల్లాలోని మాగాడి తాలూకా హుజగల్లు కొండలో భర్త అతని భార్యను హత్య చేశాడు. భర్త చేతిలో దివ్య (32) అనే మహిళ హత్యకు గురైంది. దివ్యను హత్య చేసిన ఆమె భర్త ఉమేష్ ఓ శాడిస్టు అని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం దివ్య, ఉమేష్ ల వివాహం జరిగింది.

వివాహం జరిగిన కొన్నేళ్లకే దివ్య, ఉమేష్ ల మధ్య మనస్పర్థలు వచ్చాయి. అందంగా ఉంటున్న దివ్యకు ప్రతిరోజు పెదవులకు లిప్ స్టిక్ వేసుకోవడం, అందంగా తయారు కావడం అలవాటు ఉంది. పెళ్లికాక ముందు నుంచి దివ్యకు అందంగా ఉండాలని ఆశ అని ఆమె బంధువులు, స్నేహితులు అంటున్నారు. అయితే పెళ్లి తరువాత దివ్య అంత అందంగా తయారు కావడం ఆమె భర్త ఉమేష్ కు ఏమాత్రం నచ్చలేదు
నువ్వు పెదవులకు లిప్ స్టిక్ వేసుకోకూడదని, ముఖానికి పౌడర్ వేసుకోకూడదని ఉమేష్ అతని భార్యకు షరతులు విధించడం మొదలుపెట్టాడు. అయితే భర్త ఉమేష్ మాటలు పట్టించుకోవడం మానేసిన దివ్య గత ఏడాది శరీరం మీద టాటూ కూడా వేయించుకుంది. భర్త అంటే నీకు విలువ, గౌరవం లేదని, నా మాట వినకుంటే నీ అంతు చూస్తానని ఉమేష్ అతని భార్య దివ్యకు వార్నింగ్ ఇచ్చాడు. ఇలా దివ్య, ఉమేష్ దంపతుల మద్య గొడవలు ఎక్కువ అయ్యాయి
నాకు విడాకులు ఇస్తే నేను వేరే జీవితాన్ని ప్రారంభిస్తాను అని దివ్య ఆమె భర్త ఉమేష్ కు తేల్చి చెప్పింది. ఉమేష్ అతని భార్య దివ్యకు బుద్ది మాటలు చెప్పడం మొదలుపెట్టాడు. అయితే భార్య దివ్య మాత్రం భర్త మాట వినలేదని ఆరోపణలు ఉన్నాయి. ఇదే విషయంలో భర్త ఉమేష్ నిత్యం అతని భార్య దివ్యతో గొడవపడుతున్నాడు. చివరికి దంపతులు రామనగర ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం అర్జీ పెట్టుకున్నారు.
నీకు విడాకులు ఇస్తానని ఉమేష్ అతని భార్య దివ్యకు చెప్పాడు.
ఈ నేపథ్యంలో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్న ఉమేష్, దివ్య దంపతులు కుటుంబ కలహాలతో ఇద్దరూ విడాకులు తీసుకుంటున్నట్లు దరఖాస్తులో పేర్కొన్నారు. ఈ జంట విడాకుల కేసుకు సంబంధించి బుధవారం మాగడి కోర్టుకు విచారణకు హాజరైనారు. భార్యకు విడాకులు ఇవ్వడం తనకు ఇష్టం లేదని, అయితే నా భార్య విడాకులు కావాలని పట్టుబడుతోందని ఉమేష్ అతని లాయర్ కు చెప్పాడు.
తరువాత నేను మారిపోయానని, ఇక మీదట నీ మీద అనుమానం పెంచుకోనని ఉమేష్ అతని భార్య దివ్యకు కోర్టు ఆవరణంలోనే చెప్పాడు. కోర్టుకు వచ్చిన భార్య దివ్యతో మాట్లాడిన ఉమేష్ మనం గుడికి వెలుదామని, ఇక ముందు కొత్త జీవితం మొదలుపెడుదామని ఆమెను నమ్మించాడు. తన భర్త మారిపోయాడని దివ్య కూడా అతన్ని గుడ్డిగా నమ్మింది. భార్య దివ్యను
మాగడి తాలూకాలోని హుజుగల్లు కొండ మీద కు తీసుకెళ్లి అక్కడ గుడిలో పూజలు చేశారు.
తరువాత ఉమేష్ ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం అతని స్నేహితులతో కలిసి భార్య దివ్యను అదే కొండ మీద హత్య చేశాడు. అనంతరం దివ్య మృతదేహాన్ని చీలూరు అటవీ ప్రాంతంలో పడేసి అక్కడి నుంచి అందరూ పరారయ్యారు. అడవిలోకి వెళ్లిన స్థానికులు దివ్య మృతదేహం గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు దివ్య మృతదేహాన్ని రామనగర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు ఆరా తీస్తే భార్య మీద అనుమానం, ఆమె అందంగా తయారు అవుతోందని ఉమేష్ కు కోపం ఉందని వెలుగు చూసింది. అంతేకాకుండా విడాకుల సమస్యతో భార్య దివ్యను ఆమె భర్త ఉమేష్ హత్య చేసి అడవిలో శవాన్ని విసిరేశాడని వెలుగు చూసింది.
-
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఈ టైంలో కరెంట్ వాడితే బాదుడే, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు - నేటి నుంచే అమలు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..!











Click it and Unblock the Notifications