ప్రియుడితో జల్సా చేస్తున్న భార్య తల నరికి ఊరు మొత్తం తిరిగాడు, టేబుల్ మీద తలపెట్టి టీ తాగిన భర్త !
వివాహం చేసుకున్న దంపతులు కొంతకాలం సంతోషంగా కాపురం చేశారు. అయితే తరువాత దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. బయటకు వెళ్లి ఉద్యోగం చేస్తున్న భర్త అతని భార్య మీద అనుమానం పెంచుకున్నాడు. తన భార్యకు అక్రమ సంబంధం ఉందని భర్త రగిలిపోయాడు. తన భార్య బతికుంటే తనకు లేనిపోని సమస్యలు వస్తాయని భర్త ఆందోళన చెందాడు.
భార్యకు అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో భర్త అతని భార్యను హత్య చేశాడు భార్య తల, మొండెం రెండు ముక్కలుగా నరికేశాడు. రక్తమోడుతున్న భార్య తలను చేతిలో పట్టుకున్న భర్త ఊరు మొత్తం తిరిగిన దారుణ ఘటన పశ్చిమ బెంగాల్‌లోని తూర్పు మిడ్నాపూర్‌లో చోటుచేసుకుంది. గౌతమ్ గుచ్చైత్ అలియాస్ గౌతమ్ అతని భార్యను అతి దారుణ:గా, కిరాతకంగా చంపేశాడని పోలీసులు తెలిపారు.

అంతేకాకుండా గౌతమ్ కట్టర్ ను చేతిలోనే పట్టుకుని అటూఇటూ చూశాడు. భార్య పూల్ రాణి తలని అదే బేంచ్ మీద పెట్టాడు. ఈ దృశ్యాన్ని చూసిన ఎవ్వరూ గౌతమ్ దగ్గరకు వెళ్లే సాహసం చేయ్యలేకపోవడంతో అతను సాఫీగా కుర్చున్నాడు. టీ స్టాల్ లో ఉన్న వ్యక్తికి టీ తీసుకురావాలని చెప్పడంతో అతను భయంతో అక్కడి నుంచి పరుగుతీశాడు. ఈ విషయాన్ని గమనించిన గ్రామస్థులు ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించారు.

సమీపంలోని పటాష్‌పూర్ పోలీసుల బృందం అక్కడికి చేరుకుని భార్య పూల్ రాణిని హత్య చేసి హాయిగా కుర్చున్న గౌతమ్ ను అరెస్టు చేసి తీసుకెళ్లారు. గౌతమ్ ట్రావెలింగ్ కంపెనీలో సేల్స్‌మెన్ గా పని చేస్తున్నాడని, భార్య పూల్ రాణితో చాలాకాలంగా అతనికి సత్సంబంధాలు లేవని పోలీసులు చెప్పారు. అక్రమ సంబందం పెట్టుకున్న తన భార్య పూల్ రాణి తనను మోసం చేస్తోందని అనుమానం పెంచుకున్నాడని పోలీసులు అన్నారు. తన భార్య పూల్ రాణి వేరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుందని భర్త గౌతమ్ కు విపరీతంగా అనుమానం ఉందని పోలీసులు అన్నారు.
గౌతమ్, పూల్ రాణి దంపతులకు 5వ తరగతి చదువుతున్న మైనర్ కుమారుడు ఉన్నాడు. గౌతమ్ నుంచి హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రక్తం కారుతున్న పూల్ రాణి తలను, ఆమె మొండెం స్వాధీనం చేసుకున్న పోలీసులు దానిని పోస్టుమార్టం నిమిత్తం పంపించారు.తన భార్య పూల్ రాణిని తానే హత్య చేశానని గౌతమ్ నేరం అంగీకరించాడని, బార్యను అంతదారుణంగా హత్య చేసినందుకు అతనికి ఎలాంటి ఫీలింగ్ లేదని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications