Summer: ఈసారి ఎండలు మామూలుగా ఉండవు.. హెచ్చరించిన ఐఎండీ..!
ఈసారి ఎండలు మండిపోతాయని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. ఎల్‌నినో పరిస్థితులతో మార్చిలో భారతదేశంలో సాధారణ ఉష్ణోగ్రతల కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఐఎండీ తెలిపింది. దేశంలోని కీలకమైన గోధుమ పంట గురించి ఆందోళన వ్యక్తం చేసింది.
మార్చి మొదటి అర్ధభాగంలో దేశంలోని వాయువ్య ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని IMD డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహపాత్ర తెలిపారు.
మార్చి ద్వితీయార్థంలో సాధారణం కంటే ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తర అంతర్గత కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశాలోని అనేక ప్రాంతాలలో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో పాటు వేడిగాలులు ఉండే వేడి గాలులు వీచే అవకాశం ఉందట. దేశంలో మార్చి నుంచి మే వరకు చాలా ప్రాంతాలలో సాధారణం కంటే ఎక్కువ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని మహపాత్ర చెప్పారు.

మార్చిలో ఉత్తర, మధ్య భారతదేశంలో హీట్‌వేవ్ పరిస్థితులు ఉండే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం ఉన్న ఎల్ నినో పరిస్థితులున్నాయని.. మధ్య పసిఫిక్ మహాసముద్రంలో నీటి ఆవర్తన వేడెక్కడంతో వేడి ఎక్కువగా ఉంటుందన్నారు. తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 9 గంటలకే భానుడు భగ భగ మండిపోతున్నాడు. తెలంగాణలో దాదాపు 36 డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది.రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందన్నారు.
ఈ నెలలో ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. ఆదిలాబాద్, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం , నల్గొండ, మహబూబ్ నగర్, హైదరాబాద్ లో ఉష్ణోగ్రతలు రోజు రోజుకి 3 నుంచి 4 డిగ్రీలు పెరుగుతుందని చెబుతున్నారు. మార్చి 7 వ తేదీ వరకు ఎండ తీవ్రత అధికంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.












Click it and Unblock the Notifications