వాళ్ల ఈగో వాళ్లను తినేసింది- ఇక చెప్పేదేముంది?
Delhi Election Results 2025: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో చావుదెబ్బ తిన్నది ఆమ్ ఆద్మీ పార్టీ. భారతీయ జనతా పార్టీ చేతిలో ఘోరంగా ఓటమిపాలైంది. 10 సంవత్సరాల పాలనకు చెక్ పెట్టింది కమలం. భారీ మెజారిటీతో కమ్ బ్యాక్ ఇచ్చింది. 27 సంవత్సరాల పాటు కొరుకుడు పడని ఢిల్లీ పీఠాన్ని దక్కించుకుంది.
మొత్తం 70 నియోజకవర్గాలు ఉన్న ఢిల్లీ అసెంబ్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి దక్కింది 22 స్థానాలే. బురారీ, కిరారీ, సుల్తాన్‌పూర్ మజ్రా, సదర్ బజార్, చాందినీ చౌక్, మటియా మహల్, బల్లిమరన్, కరోల్ బాగ్, పటేల్ నగర్, తిలక్ నగర్, ఢిల్లీ కంటోన్మెంట్, దేవ్లీ, అంబేద్కర్ నగర్, కల్కాజీ, తుగ్లకాబాద్, బదార్‌పూర్, ఓఖ్లా, కొండ్లీ, సీమాపురి, శీలంపూర్, బాబర్‌పూర్, గోపాల్‌పూర్ స్థానాలు ఆప్ ఖాతాలో పడ్డాయి.

మొత్తంగా బీజేపీకి పోల్ అయిన ఓట్ల శాతం 45.56. రెండు శాతం ఓట్లతో వెనుకంజ వేసింది ఆప్. 43.57 శాతానికి సరిపెట్టుకోవాల్సొచ్చింది. ఈ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ జీరో అయింది. 6.34 శాతం ఓట్లకే పరిమితం అయింది. జనతాదళ్ (యునైటెడ్) ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది.
ఈ ఘోర ఓటమి అనంతరం ముఖ్యమంత్రి ఆతిషి తన పదవికి రాజీనామా చేశారు. కొద్దిసేపటి కిందటే రాజ్ నివాస్‌లో లెప్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాను కలిశారు. తన రాజీనామా పత్రాన్ని అందజేశారు. దీన్ని వెంటనే ఆమోదించారు ఎల్జీ. 20 నిమిషాల్లోనే రాజీనామా ప్రక్రియ పూర్తయింది. రాజ్ నివాస్ వద్ద విలేకరులతో ఆమెతో మాట్లాడటానికి ప్రయత్నించినప్పటికీ నిరాకరించారు. ఆసక్తి చూపలేదు.
ఈ ఎన్నికల్లో చవి చూసిన ఓటమి.. ఆమ్ ఆద్మీ పార్టీ వ్యూహాలను తలకిందులు చేసినట్టయింది. ఈ విడత కూడా గెలిచివుంటే గోవా వంటి చిన్న రాష్ట్రాల్లో పార్టీని విస్తరింపజేసుకోవడం, ప్రతిపక్షాల ఉమ్మడి సంకీర్ణ కూటమి ఇండియాలో డ్రైవింగ్ ఫోర్స్‌గా మారాలనుకున్న కేజ్రీవాల్ ఆశలపై నీళ్లు చల్లినట్టయింది.
ఈ పరిణామాలపై కాంగ్రెస్ రాజ్యసభ సభ్యురాలు, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి స్పందించారు. ఆప్ ఓటమిపై కీలక వ్యాఖ్యలు చేశారు. అహంకారపూరిత పరిపాలనే ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమికి దారి తీసిందని విశ్లేషించారు. ఈ ఓటమి ప్రభావం ప్రతిపక్షాల ఉమ్మడి కూటమి ఇండియాపై పడుతుందని అనుకోవట్లేదని వ్యాఖ్యానించారు.
ఈ మధ్యాహ్నం ఏఐసీసీ కేంద్ర కార్యాలయంలో తనను కలిసిన విలేకరులతో ఆమె మాట్లాడారు. కాంగ్రెస్ పోటీ చేయడం వల్ల ఓట్లు చీలి ఆప్ ఓడిపోయిందని, పరోక్షంగా ఈ పరాజయానికి కారణమైందంటూ వస్తోన్న వార్తలను తోసిపుచ్చారు. ఢిల్లీ ఎన్నికల్లో తమకోసం తాము పోటీ చేశామని వివరించారు. ఎన్నికలు జరిగినప్పుడు ఎన్నో పార్టీలు, అభ్యర్థులు పోటీలో దిగుతుంటారని గుర్తు చేశారు.
ఎవరి లబ్ది కోసమో లేక ఎవరిని దెబ్బతియడానికో తాము పోటీ చేయలేదని రేణుకా చౌదరి అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ తన అహంకారానికి తాను బలైందని వ్యాఖ్యానించారు. ఇదే విషయాన్ని చాలాసార్లు చెప్పామనీ గుర్తు చేశారు. ఓడిపోయినప్పటికీ- ఆప్ పట్ల తమ గౌరవం తగ్గదని, దేశ ప్రయోజనాల కోసం మిత్రపక్షంగానే ఆదరిస్తామని ఆమె తేల్చి చెప్పారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం సమష్టిగా పోరాడతామని అన్నారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications