జమ్మూ కాశ్మీర్ లో గోవు మాంసం బ్యాన్ (వీడియో)
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ లో గోవు మాంసం విక్రయించరాదని అక్కడి హై కోర్టు తీర్పు చెప్పింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ జనక్ రాక్ నేతృత్వంలోని ద్విసభ్య బెంచ్ అర్జీ విచారణ చేసి గోవు మాంసం విక్రయాలను నిషేధించారు.

గోవులను హత్య చెయ్యడం పాపం, గోవులను తాము పూజిస్తామని పరిమోక్ష సేఠ్ అనే ఆయన హై కోర్టులో అర్జీ సమర్పించారు. గోహత్యను నిషేదించాలని కోర్టులో మనవి చేశారు. పరిమోక్ష సమర్పించిన అర్జీని హై కోర్టు న్యాయమూర్తులు క్షుణ్ణంగా పరిశీలించారు.
జమ్మూ కాశ్మీర్ లోని అన్ని జిల్లాలలో గోవు మాంసం విక్రయాలు నిషేధిస్తున్నామని తీర్పు చెప్పారు. వెంటనే ఈ ఆదేశాలను అమలులోకి తీసుకురావాలని జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వానికి హై కోర్టు సూచించింది. ఆలస్యం చేసినా, నియమాలు ఉల్లంఘించినా కఠిన చర్యలు తీసుకుంటామని హై కోర్టు తీర్పులో వెల్లడించింది.












Click it and Unblock the Notifications