వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ బాలీవుడ్ దర్శకుడికి వై కేటగిరి సెక్యూరిటీ: సీఆర్పీఎఫ్ బలగాలతో పాన్ ఇండియా భద్రత

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన మూవీ- ది కాశ్మీరీ ఫైల్స్. మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, బ్రహ్మదత్, ప్రకాష్ బెళవాడి, పల్లవీ జోషి నటించిన బాలీవుడ్ సినిమా ఇది. వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో తెరకెక్కిందీ మూవీ. 1990వ దశకంలో కాశ్మీరీ పండిట్లు ఎదుర్కొన్న ఇబ్బందుల చుట్టూ అల్లుకున్న కథతో తెరకెక్కింది. ఈ నెల 11వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల కనకవర్షం కురిపిస్తోంది. 200 కోట్ల రూపాయల క్లబ్‌లో చేరుతుందనే అంచనాలు ఉన్నాయి.

 పన్ను మినహాయింపు..

పన్ను మినహాయింపు..

ఉత్తరాదిన పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సినిమాకు ఎంటర్‌టైన్‌మెంట్ ట్యాక్స్‌ను సైతం మినహాయించాయి. ఉత్తర ప్రదేశ్, గుజరాత్, అస్సాం, హర్యానా, మధ్యప్రదేశ్ వంటి భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల ప్రభుత్వాలు పన్ను మినహాయింపులను ప్రకటించాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైతం ది కాశ్మీర్ ఫైల్స్‌ను ప్రశంసించారు. ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలని పిలుపునిచ్చారు. అస్సాం ప్రభుత్వం ఓ అడుగు ముందుకేసింది.

ఉద్యోగులకు స్పెషల్ లీవ్..

ఉద్యోగులకు స్పెషల్ లీవ్..

ఈ సినిమా చూడటానికి ప్రభుత్వ ఉద్యోగులకు ఏకంగా స్పెషల్ లీవ్‌ను ఇచ్చింది. ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగి కూడా ఈ సినిమాను చూడాలని సూచించింది. ఈ సినిమా చూశామనడానికి సాక్ష్యంగా ఉద్యోగులు- టికెట్లను తమ శాఖలు, విభాగాధిపతులకు అందజేయాల్సి ఉంటుందని పేర్కొంది. టికెట్లను ఇచ్చిన వారికి హాఫ్ డే సెలవును మంజూరు చేయాలని ఆదేశాలను జారీ చేసింది. ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించారు.

ప్రశంసల వర్షం..

ప్రశంసల వర్షం..

ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. బాలీవుడ్ టాప్ సెలెబ్రిటీలు చిత్రం యూనిట్‌ను ప్రశంసిస్తోన్నారు. అద్భుతంగా దీన్ని చిత్రీకరించారని చెబుతున్నారు. సున్నితమైన కథను అంతే సున్నితంగా ఇచ్చిన ట్రీట్‌మెంట్ ఆశ్చర్య పరుస్తోందని చెబుతున్నారు. వాస్తవాలను ప్రతిబింబించే ది కాశ్మీర్ ఫైల్స్ వంటి సినిమాలు మరిన్ని రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు. ప్రతి ఒక్కరూ దీన్ని చూడాలని సూచిస్తున్నారు.

వివాదాలు తక్కువేమీ కాదు..

వివాదాలు తక్కువేమీ కాదు..

అదే స్థాయిలో వివాదాలను కూడా చవి చూస్తోందీ మూవీ. ఎప్పుడో 30 సంవత్సరాల కిందట కాశ్మీర్‌లో చోటు చేసుకున్న ఉదంతాన్ని ఇప్పుడు ఎందుకు సినిమాగా తీయాల్సి వచ్చిందని, లేని అంశాలను ఇందులో జొప్పించారనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. ఇన్ని సంవత్సరాల పాటు కాశ్మీరీ పండిట్ల అంశాన్ని ఎందుకు ఎందుకు నిర్మించలేదనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. దీని వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని చెబుతున్నారు.

వివేక్‌ అగ్నిహోత్రికి వై సెక్యూరిటీ..

వివేక్‌ అగ్నిహోత్రికి వై సెక్యూరిటీ..


ఈ పరిణామాల మధ్య ది కాశ్మీర్ ఫైల్స్ సినిమా దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి భద్రతపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఆయనకు వై కేటగిరి సెక్యూరిటీని కల్పించింది. సీఆర్పీఎఫ్ బలగాలతో పాన్ ఇండియా భద్రతను ఏర్పాటు చేసింది. ఆయన నివాసం వద్ద భద్రతను పెంచింది. వివేక్ అగ్నిహోత్రి దేశంలో ఎక్కడికి వెళ్లినా.. ఆయనకు సీఆర్పీఎఫ్ భద్రత ఉండేలా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనపై దాడులు చోటు చేసుకునే అవకాశం ఉండటం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.

English summary
Film director Vivek Agnihotri has been given 'Y' category security with CRPF cover pan India after The Kashmir Files movie super hit.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X