పూజారిని ఇంత దారుణంణంగా హత్య చేస్తారా ?, కళ్లు, ప్రైవేట్ పార్ట్స్, పీకేసి !
శివాలయంలో ప్రధాన అర్చకుడిగా విధులు నిర్వహిస్తున్న మనోజ్ కుమార్ ఎలాంటి వివాదాల్లోకి దిగేవారు కాదు. అర్చకుడు మనోజ్ కుమార్ ఎవరినీ బాధపెట్టేవాడు కాదు. ఎవరి మీదా మనోజ్ కుమార్ కు కోపం రాలేదని తెలిసింది. అయితే ఆరు రోజుల క్రితం ఉదయం ఆలయంలో పూజలు చెయ్యడానికి వెళ్లిన పూజారి మనోజ్ కుమార్ కనిపించకుండా పోయాడు.
పూజారి ఆచూకి తెలుసుకుంటామని పోలీసులు హామీ ఇచ్చినా ఫలితం లేకుండా పోయింది. వారం తర్వాత పూజారి మనోజ్ కుమార్ మృతదేహం లభ్యమైంది. పూజారి మనోజ్ కుమార్ పై కాల్పులు జరిపారని వెలుగు చూసింది. పూజారి మనోజ్ కుమార్ రెండు కళ్లను బయటకు పీకేశారు. బీహార్‌లోని గోపాల్‌గంజ్ జిల్లా దానాపూర్ గ్రామంలో నివాసం ఉంటున్న శివాలయం అర్చకుడు మనోజ్ కుమార్ ను అతి దారుణంగా హత్య చేసిన నిందితులు అతని మర్మాంగం కూడా కత్తిరించేయడం కలకం రేపింది.

అర్చకుడిని అతి దారుణంగా హత్య చేసిన ఘటన బీహార్ లో చోటుచేసుకోవడం కలకలం రేపింది. దానాపూర్ గ్రామంలోని శివాలయంలో మనోజ్ కుమార్ ప్రధాన పూజారి. ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ప్రత్యేక పూజలు చేసి భక్తులకు ప్రసాదం పంపిణీ చేస్తుంటారు. మనోజ్ కుమార్ తన జీవితాన్ని పూర్తిగా గుడికే అంకితం చేశాడని, రోజూ శివుని సేవిస్తూ గడిపేవాడని ఆ ఊరి ప్రజలు అంటున్నారు.
వారం రోజుల క్రితం మనోజ్ కుమార్ తన ఇంటి నుంచి ఉదయం గుడికి వెళ్లాడు. ఆలయానికి చేరుకుని పూజ కైంకర్యాన్ని ప్రారంభించిన మనోజ్ కుమార్ తరువాత కనిపించకుండా పోయాడు. సాయంత్రం అయినా మనోజ్ కుమార్ ఇంటికి రాకపోవడంతో అతని కోసం కుటుంబ సభ్యులు, బందువులు, స్నేహితులు వెతకడం ప్రారంభించారు. మనోజ్ కుమార్ సోదరుడు, జిల్లా బీజేపీ నేత అశోక్ కుమార్ ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ కేసులో దర్యాప్తు చేస్తామని పోలీసులు అర్చకుడు మనోజ్ కుమార్ కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు.
ఇటీవల గ్రామంలో కొందరు చిల్లర రౌడీల అఘాయిత్యాలు ఎక్కువయ్యాయి. మనోజ్‌కుమార్ సోదరుడు బీజీపీ నేత కావడం వల్లే ఈ అపహరణ జరిగి ఉండొచ్చని అశోక్ కుమార్ ఫిర్యాదులో పేర్కొన్నారు. వారం రోజుల తర్వాత శివాలయం పూజారి మనోజ్ కుమార్ మృతదేహం లభ్యమైంది.
మనోజ్ కుమార్ పై తుపాకులతో కాల్పులు జరిపారని, శరీరం చాలా బుల్లెట్లు ఉన్నాయని, పూజారి రెండు కళ్లూ తీసేశారని, అతని మర్మాంగం పూర్తిగా తెగిపోయిందని వెలుగు చూసింది శివాలయం పూజారి మనోజ్ కుమార్ ను కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేశారని వెలుగు చూడటం కలకలం రేపింది. ఈ దారుణ హత్య వార్త గ్రామంలో వ్యాపించింది. దీంతో గ్రామస్తుల ఆగ్రహానికి గురి కావడంతో నిరసనలు మొదలయ్యాయి.

నిరసనను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జి చెయ్యడంతో అది హింసాత్మకంగా మారింది. రెండు పోలీసు వాహనాలకు నిప్పు పెట్టడంతో పోలీసులు కూడా గాయపడ్డారు. ఈ దారుణ హత్య వార్త వ్యాపించడంతో ప్రజల ఆగ్రహానికి గురైయ్యింది. ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు అదనపు పోలీసు బలగాలను రంగంలోకి దింపారు. అయితే శివాలయం అర్చకుడు మనోజ్ కుమార్ హత్యకు కచ్చితమైన కారణాలు తెలియడం ఇంకాతెలీలేదని, కేసు దర్యాప్తులో ఉందని పోలీసు అధికారులు అంటున్నారు.
-
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!!












Click it and Unblock the Notifications