అక్రమ సంబందం, భర్తను రెడ్ హ్యాండెడ్ గా బెడ్ రూమ్ లో పట్టుకున్న లేడీ పోలీసు

విడాకులు తీసుకున్న మహిళతో ఎంజాయ్ చేస్తున్న పోలీసును అతని భార్య రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ఘటన కర్ణాటకలోని రాయచూర్ జిల్లా సిరవర పట్టణంలో చోటుచేసుకుంది.పోలీసు కానిస్టేబుల్ రాజ్ మహ్మద్ గత నాలుగేళ్లుగా విడాకులు తీసుకున్న ఓ మహిళతో పిచ్చపాటిగా ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తి భార్య కూడా పోలీసు కావడంతో అక్కడే కథ రివర్స్ అయ్యింది.

రాజ్ మహ్మద్ సిరివార పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. రాజ్ మహ్మద్‌కు గతంలో సవితల పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్నప్పుడు ఆసుపత్రిలో స్టాఫ్ నర్సుగా పనిచేస్తున్న సరళ అనే మహిళతో పరిచయం ఏర్పడింది. పోలీస్ స్టేషన్, హాస్పిటల్ రెండూ ఎదురెదురుగా ఉంటాయి. కాబట్టి రోజూ మోహ్మద్, సరళ ఒకరినొకరు చూసుకుంటున్నారు. ఒకే ప్రాంతంలో ఉద్యోగం చేస్తున్న మహ్మద్, సరళ ఎదురు పడిన సమయంలో ఒకరిని ఒకరు మాట్లాడుకుంటున్నారు.

The lady cop caught her husband red-handed for having an illicit relationship

ఇద్దరి మధ్య సాధారణంగా మాట్లాడుకుంటున్న మాటలు, వారి సంభాషణ రానురాను హద్దులు దాటిపోయి అక్రమ సంబంధానికి దారితీసింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో మహ్మద్ అతని ప్రియురాలు సరళ తో ఎంజాయ్ చేసి వస్తున్నాడు. రానురాను ఇద్దరి మద్య విపరీతంగా కామకోరికలు పెరిగిపోయాయి.దేవదుర్గ పోలీస్ స్టేషన్‌లో పీసీగా పనిచేస్తున్న అతని భార్య పారి బేగంకు తన భర్త తనను మోసం చేస్తున్నాడని అనుమానం వచ్చింది.

అయితే తన భర్త మహ్మద్ ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోకపోతే అతను ఎదురుతిరుగుతాడని,, అతన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలని అతని పారి బేగం వేచి చూసింది. అయితే భర్త మహ్మద్ ప్రేమ రానురాను తగ్గిపోవడంతో అతని భార్య పారీ బేగం ఈ విషయాన్ని ఎస్పీ దృష్టికి తీసుకెళ్లింది. ఇంత జరిగినా భర్త మహ్మద్, సరళతో అతని అక్రమ సంబందాన్ని కొనసాగించాడు. భార్య పారి బేగం డ్యూటీలో ఉండగా మహ్మద్ అతని ప్రియురాలు సరళతో ఆనందంగా గడిపాడు.

అయితే గురువారం మహ్మద్ భార్య పారి బేగం డ్యూటీకి వెళ్లింది. భార్య వెళ్లిపోతుండగా పోలీసు మహ్మద్ అతని ప్రియురాలు నర్సు సరళను అతని ఇంటికి పిలిచాడు. ఇంట్లోకి వెళ్లిన సరళ ఆమె ప్రియుడు మహ్మద్ తో రొమాన్స్ చెయ్యడం మొదలుపెట్టింది. అదే సమయంలో మహ్మద్ భార్య పారీ బేగంకు ఫోన్ చేసి ఆమె భర్త వ్యవహారం గురించి చెప్పారు. పారి బేగం డ్యూటీకి వెళ్లకుండా నేరుగా తిరిగి ఇంటికి వచ్చింది.

The lady cop caught her husband red-handed for having an illicit relationship

ఇంటికి వచ్చిన పారీ బేగం ఇంటికి వచ్చి తలుపు తట్టగా లోపల ప్రేమికులు రొమాన్స్ చేస్తూ ఈలోకాన్ని మైమరచిపోయారు. కొంత సేపటి తరువాత మహ్మద్ ఇంటి తలుపులు తీసి చూడగా ఎదురుగా అతని భార్య పారి బేగం దర్శనం ఇవ్వడంతో అతను హడలిపోయాడు. భర్త మహ్మద్, అతని ప్రియురాలు సరళను ఇంటిలోపల వేసి బయట తాళం వేసిన పారి బేగం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

అయితే పోలీసులు వచ్చి ఇద్దరిని చూసి వాళ్లను పోలీస్ స్టేషన్ కు పిలుచుకుని వెళ్లారు. భార్యభర్తలు ఇద్దరూ పోలీసులు కావడంతో ఈ విషయంపై ఇంత వరకు కేసు నమోదు కాలేదని తెలిసింది. భార్యభర్తలు, ప్రియురాలు ముగ్గూరు ప్రభుత్వ ఉద్యోగులు కావడంతో ఈ వవిషయం బయటకు వస్తే ముగ్గురికి సమస్యలు వస్తాయని గుర్తించిన పోలీసు అధికారులు ఆ ముగ్గురితో చర్చలు జరుపుతున్నారని తెలిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+