lady doctor: ప్రైవేట్ పార్ట్స్ వర్ణిస్తూ మేసేజ్ లు, మేడమ్ మంచిది కాబట్టి ?, ధైర్యం లేదంట !

చెన్నై: లేడీ డాక్టర్ సొంతంగా క్లీనిక్ పెట్టుకుని రోగులకు వైద్యం చేస్తున్నారు. ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి వరకు లేడీ డాక్టర్ ఆమె క్లీనిక్ లో ఉంటున్నారు. కొంతకాలం క్రితం లేడీ డాక్టర్ కు వాట్సాప్ లో ఓ మెసేజ్ వచ్చింది. లేడీ డాక్టర్ మీరు చాలా అందంగా ఉన్నారని ఆ మెసేజ్ లో ఉంది. అయితే లేడీ డాక్టర్ ఆ మెసేజ్ గురించి పెద్దగా పట్టించుకోలేదని తెలిసింది. తరువాత లేడీ డాక్టర్ శరీరంలోని ప్రతి పార్ట్ ను వర్ణిస్తూ మళ్లీ మెసేజ్ లు వెళ్లాయి. లేడీ డాక్టర్ ఆ వాట్సాప్ నెంబర్ ను బ్లాక్ చేసింది. ఈసారి నేరుగా లేడీ డాక్టర్ కు ఫోన్ చేసిన వ్యక్తి ఆమె అందంగా గురించి, ఆమె శరీరంలోని ప్రైవేట్ పార్ట్స్ గురించి వర్ణించడం మొదలుపెట్టాడు. లేడీ డాక్టర్ వార్నింగ్ ఇచ్చినా అతను మాత్రం ఫోన్ లో పదేపదే ఆమెతో బూతులు మాట్లాడాడు.

 లేడీ డాక్టర్

లేడీ డాక్టర్

చెన్నైలోని కొట్టూరుపురంలో నివాసం ఉంటున్న లేడీ డాక్టర్‌ మైలాపూర్‌ డిప్యూటీ పోలీస్ కమిషనర్‌ ను కలిసి ఫిర్యాదు చేశారు. తనకు ఇప్పటికే వివాహం అయ్యిందని, 13 ఏళ్ల కుమారుడు ఉన్నాడని లేడీ డాక్టర్ తెలిపారు. సొంతంగా క్లినిక్‌ నడుపుతున్న తనకు ఓ వ్యక్తి తప్పుడు ఉద్దేశంతో వాట్సాప్‌ ద్వారా తన అందాన్ని వివరిస్తూ రోజూ మెసేజ్‌లు పంపుతున్నాడని లేడీ డాక్టర్ ఫిర్యాదు చేశారు.

 వాట్సాప్ నెంబర్ బ్లాక్ చేస్తే ?

వాట్సాప్ నెంబర్ బ్లాక్ చేస్తే ?

మెసేజ్ లు పంపిస్తున్న వ్యక్తిని మందలించి వాట్సాప్ ను డిస్‌కనెక్ట్‌ చేశానని, తరువాత నేరుగా నా ఫోన్ నెంబర్ కు ఫోన్లు చేసి మాట్లాడుతున్నాడని, తనతో అసభ్యకరంగా మాట్లాడుతున్నాడని, వాట్సాప్‌ కనెక్ట్ చెయ్యాలని వేధిస్తున్నాడని లేడీ డాక్టర్ ఫిర్యాదు చేశారు. పదే పదే మందలించినా తనను వేధింపులకు గురిచేస్తున్నాడని, గుర్తు తెలియని ఆ వ్యక్తి మీద చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని లేడీ డాక్టర్ డీసీపీకి మనవి చేశారు.

 చెన్నైలో ఉద్యోగం

చెన్నైలో ఉద్యోగం

లేడీ డాక్టర్ శరీరంలోని ప్రతి పార్ట్ ను వర్ణిస్తూ మెసేజ్ లు వెళ్లాయని పోలీసులు గుర్తించారు. లేడీ డాక్టర్ ఆ వాట్సాప్ నెంబర్ ను బ్లాక్ చేసిన తరువాత కూడా అతను ఆమెకు ఫోన్ చేసి ఆమె అందంగా గురించి, ఆమె శరీరంలోని ప్రైవేట్ పార్ట్స్ గురించి వర్ణించాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. కేసు విచారణ చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలించారు. చెన్నై పమ్మల్‌కు చెందిన పన్నీర్‌సెల్వం అసభ్యకరమైన మెసేజ్ లు లేడీ డాక్టర్ కు పంపించాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

 మేడమ్ అందం చూసి తట్టుకోలేకపోయాను

మేడమ్ అందం చూసి తట్టుకోలేకపోయాను

డ్రగ్స్ సేల్స్ రిప్రజెంటేటివ్ గా ఉన్న పన్నీర్ సెల్వంను పోలీసులు అదుపులోకి తీసుకుని బెండ్ తీశారు. మహిళా వైద్యురాలి అందానికి తాను మైమరచిపోయానని, మాత్రలు సరఫరా చేయడానికి ఆమె క్లినిక్‌కి వెళ్లి వస్తున్న సమయంలో ఆమె అందం చూసి తట్టుకోలేకపోయానని పన్నీర్ సెల్వం చెప్పాడని పోలీసులు అన్నారు.

ధైర్యం లేక ఇలా చేశాను

ధైర్యం లేక ఇలా చేశాను

లేడీ డాక్టర్ తో వ్యక్తిగతంగా మాట్లాడేందుకు ధైర్యం లేకపోవడం వలనే వాట్సాప్ లో మెసేజ్ లు పంపించానని, తరువాత ఫోన్లు చేసి ఆమెతో అసభ్యంగా మాట్లాడాడనని పన్నీర్ సెల్వం అంగీకరించాడని పోలీసు అధికారులు అన్నారు. లేడీ డాక్టర్ ను టార్చర్ పెట్టిన పన్నీర్ సెల్వం ను అరెస్టు చేసి అతన్ని కోర్టులో హాజరుపరిచి జైలుకు పంపించామని చెన్నై పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+