పంజాబ్ లో పార్టీల చివరి ప్రయత్నాలు - చతుర్ముఖ పోటీలో నువ్వా నేనా : మారుతున్న రాజకీయం..!!

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఈ నెల 20న జరగనుంది. ఈ సాయంత్రంతో ఎన్నికల ప్రచారం ముగుస్తుంది. ఓటర్లను తమ వైపు తిప్పుకోవటం కోసం ప్రధాన పార్టీలు చివరి రోజున ప్రత్యర్ధి పార్టీలను మాటల తూటాలతో టార్గెట్ చేస్తున్నారు. ఈ సారి పంజాబ్ లో చతుర్ముఖ పోటీ నెలకొంది. ఇప్పటికే హంగ్ ప్రచారం సాగుతోంది. అదే జరిగితే సమీకరణాలు పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న పొత్తులు.. ఫలితాల తరువాత మారే అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ అధికారం దక్కించుకోకుండా బీజేపీ... ఎలాగైనా బీజేపీకి మాత్రం సీఎం పీఠం దక్కకుండా చూడటమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రాంతీయ పార్టీలతో కలిసి వ్యూహాలు సిద్దం చేస్తున్నాయి.

Recommended Video

    Punjab Elections 2022: పైకి ధీమా..లోపల అంతర్గత సమస్యలు | Election Commission | Oneindia Telugu
    2017 ఎన్నికల్లో ఆ రెండు కూటములే..

    2017 ఎన్నికల్లో ఆ రెండు కూటములే..

    2017 ఎన్నికల వరకు పంజాబ్ లో కాంగ్రెస్ ..శిరోమణీ అకాలీదల్ మధ్యనే ప్రధానంగా పోటీ ఉండేది. కాంగ్రెస్ మిత్రపక్షాలు..శిరోమణి మిత్రపక్షంగా బీజేపీ ఉండేవి. అయితే, రైతు ఉద్యమ సమయంలో శిరోమణి బీజేపీ నుంచి వీడిపోయింది. ఇక, కాంగ్రెస్ సీఎంగా ఉన్న సమయంలోనే అధినాయకత్వంతో వచ్చిన విభేదాల కారణంగా ఆయన పార్టీ వీడి సొంత పార్టీ ఏర్పాటు చేసారు. ఈ ఎన్నికల్లో శిరోమణి అకాలీదళ్​.. బీఎస్పీతో కలిసి పోటీ చేస్తుండగా.. కాంగ్రెస్ ఒంటరిగానే బరిలోకి దిగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా పుంజుకొని ప్రధాన పార్టీలకు షాకిచ్చిన ఆమ్​ ఆద్మీ పార్టీ.. ఈసారి సీఎం పీటంపై కన్నేసింది. రాష్ట్రంలో బలమైన కేడర్​ ఉన్న శిరోమణి అకాలీదళ్​ సైతం గెలుపు కోసం శక్తిమేరకు కృషి చేస్తోంది.

    మేజిక్ ఫిగర్ వస్తే..ఆ తరువాత

    మేజిక్ ఫిగర్ వస్తే..ఆ తరువాత

    117 స్థానాలున్న పంజాబ్​లో ఏ పార్టీ మేజిక్​ ఫిగర్​ను చేరుకుంటుందనే దాని పైన భిన్నాభిప్రాయలు వ్యక్తం అవుతున్నాయి. అధికారంలో ఉన్న కాంగ్రెస్ చన్నీని సీఎం చేయటం ద్వారా దళిత ఓటింగ్ తమ వైపే ఉంటుందనే అంచనాతో ఉంది. 2017లో కాంగ్రెస్​ పార్టీ 79 సీట్లు గెలుచుకుంది. ఎన్నికల తర్వాత కాంగ్రెస్​ మరో పార్టీతో పొత్తు పెట్టుకునే అవకాశాలు కూడా లేకపోలేదు. అకాలీదళ్​ ఈ ఎన్నికల్లో తొలిసారి బహుజన సమాజ్ పార్టీతో కలిసి కూటమిగా పోటీ చేస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీ 2017లో 20 సీట్లు గెలుచుకొని.. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది. తొమ్మిది మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడినా.. ఆప్​ అధినేత కేజ్రీవాల్ మాత్రం ఆశలు వదులుకోలేదు. భగవంత్‌ మాన్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించారు. ఈ పార్టీకి మాల్వా ప్రాంతంలో గట్టి పట్టుంది. ఇక, బీజేపీ ఈసారి కొత్త కూటమితో బరిలోకి దిగుతోంది.

    ఫలితాల తరువాత పొత్తులు మారుతాయా

    ఫలితాల తరువాత పొత్తులు మారుతాయా

    పంజాబ్​ లోక్​ కాంగ్రెస్​ అధినేత అమరీందర్​ సింగ్​ కూటమికి పెద్ద ముఖంగా ఉన్నారు. అమరీందర్ పార్టీ ఎన్ని స్థానాలు గెలుస్తుంది అనే దానికంటే.. ఎన్ని చోట్ల హస్తం పార్టీ ఓట్లను చీల్చుతుంది అనేది ఇక్కడ కీలకం కానుంది.అకాలీదళ్ సంయుక్త్ పార్టీ పెద్దగా బలం పుంజుకోలేక పోయినా.. చాలా స్థానాల్లో సిక్కుల ఓటు బ్యాంకును కూడగట్టుకునే అవకాశం ఉంది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 59స్థానాలు ఏ పార్టీకీ రాకపోతే.. ఎన్నికల తర్వాత శిరోమణి అకాలీదళ్​కు కాంగ్రెస్, ఆప్​ మినహా ఇతర పార్టీలు మద్దతిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో..అభ్యర్ధుల ఎంపిక నుంచి ప్రచారం..పోలింగ్ వరకు పార్టీలు అంతా వ్యూహాత్మకంగా ముందడుగు వేస్తున్నాయి. అయితే, పార్టీలు ఎవరు ఎవరితో కలిసినా... ప్రజలు ఏ పార్టీకి అండగా నిలుస్తారనేది మాత్రం వచ్చే నెల 10వ తేదీన తేలనుంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+