గేదెను ఢీకొట్టాడని బాలుడిని చంపిన వ్యక్తులు..
జార్ఖండ్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అనుకోకుండా రోడ్డుకు అడ్డంగా వచ్చిన గేదేను బైక్‌పై వెళుతున్న ఓ బాలుడు ఢీకొట్టాడు. అయితే, కొందరు వ్యక్తులు గేదేను ఢీకొట్టాడనే నెపంతో ఆ బాలుడిని తీవ్రంగా కొట్టారు. దీంతో ఆ బాలుడు చనిపోయాడు. జార్ఖండ్‌లో చోటుచేసుకున్న ఈ సంఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.
పదహారేళ్ల బాలుడు..:జార్ఖండ్‌లోని దుమ్కా జిల్లా సంతాలిలోని కుర్మహత్ కు చెందిన ఓ పదహారేళ్ల బాలుడిని ఓ గేదెల మంద వెంట వచ్చిన సమూహం దారుణంగా కొట్టి చంపేసారు. కుర్మహత్‌కు చెందిన ఆ బాలుడు ఆదివారం సాయంత్రం ఫుట్ బాల్ మ్యాచ్ చూసేందుకు మిత్రులతో కలిసి వెళ్లాడు. అనంతరం తన ముగ్గురు స్నేహితులతో కలిసి బైక్ పై ఇంటికి వస్తున్న తరుణంలో హన్సిదిహా పోలీస్ స్టేషన్ పరిధిలోని తాథీ గ్రామానికి చేరుకున్నాడు. ఈ నేపథ్యంలో ఆ బాలుడి బైక్ అనుకోకుండా గేదెల గుంపులోని ఓ గేదెను ఢీకొట్టింది. అయితే, అక్కడే ఉన్న ఆ గేదెల మంద వెంట వచ్చిన కొంతమంది వ్యక్తులు బాలుడిని మీద అరవడం మొదలుపెట్టారు. ఆ సమూహంలోని వ్యక్తులకు ఆ బాలురకు గొడవ ప్రారంభమైంది. ఆ బాలుడు గుంపులోని వ్యక్తులకు నష్టపరిహారం ఇచ్చేందుకు కూడా అంగీకరించాడు. కానీ ఆ సమూహం పెద్దగా పట్టించుకోలేదు. అయితే, ఆ సమూహంలోని నలుగురు వ్యక్తులు ఆ బాలుడిని కొట్టడం ప్రారంభించాడు. దీంతో ఆ బాలుడి వెంటవచ్చిన మిత్రులంతా అక్కడి నుంచి పరుగు పెట్టారు.

బాలుడి తరపు బంధువుల నిరసన..:ఆ సమూహం చేసిన దాడితో బాలుడు తీవ్ర గాయాలపాలయ్యాడు. స్థానికులు గమనించి బాలుడిని సరైయత్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి ఆ బాలుడు మరణించాడు. దీంతో బాలుడి తల్లిదండ్రులు, బంధువులు, స్థానికులు ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే నిందితులను అరెస్టు చేయాలంటూ డిమాండ్ చేస్తూ గ్రామ సమీపంలోని రహదారిని దిగ్బందించడం జరిగింది. తమకు న్యాయం చేయాలంటూ బాలుడి తరపు బంధువులు రహదారిపై బైఠాయించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి బయలుదేరి ఆందోళనను విరమింపజేసి, వారికి నచ్చజెప్పారు. నిందితులను రెండు రోజుల్లో అరెస్టు చేస్తామని పోలీసులు హామీ ఇచ్చారు. దీంతో బాలుడి బంధువులు శాంతించారు. అయితే, జార్ఖండ్‌లో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.












Click it and Unblock the Notifications