Crime News: సూట్‌కేస్‌లో యువతి మృతదేహం.. హత్య చేసింది ఎవరంటే..?
గత వారం యూపీలోని యమునా ఎక్స్‌ప్రెస్‌వే సమీపంలో ట్రాలీ బ్యాగ్‌లో యువతి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని యువతి హత్య మిస్టరీని ఛేదించారు. సోమవారం మధుర పోలీసులు ప్రెస్ మీట్ లో హత్య కేసు వివరాలు వెల్లడించారు. మృతదేహం ఢిల్లీలోని బదర్‌పూర్‌కు చెందిన 21 ఏళ్ల యువతి ఆయుషి యాదవ్‌గా గుర్తించారు. మృతురాలి ముఖంపై రక్తపు మరకలు, ఛాతీపై బుల్లెట్ గాయాలు కూడా ఉన్నట్లు సమాచారం.

తండ్రి
యువతి తండ్రే ఆమెను హత్య చేశాడు. కొన్ని రోజుల క్రితం ఆయుషి యాదవ్ తన తండ్రికి సమాచారం ఇవ్వకుండా ఎక్కడికో వెళ్లిపోయింది. ఆ తర్వాత ఆమె కుటుంబ సభ్యులకు తెలియకుండా ఓ వ్యక్తిని వివాహం చేసుకున్నారు. నవంబర్ 18, శుక్రవారం, ఆమె ఇంటికి తిరిగి వచ్చింది. పెళ్లి విషయంలో ఆమెకు కుటుంబ సభ్యులకు వాగ్వాదం జరిగింది. ఆవేశంలో తండ్రి ఆయుషిపై కాల్పులు జరిపాడు. దీంతో ఆమె చనిపోయింది.

ప్లాస్టిక్ సంచి
తల్లిదండ్రులు తమ కుమార్తె మృతదేహాన్ని ప్లాస్టిక్ సంచిలో చుట్టి సూట్‌కేస్‌లో పెట్టారు.నవంబర్ 19న తెల్లవారుజామున 3 గంటలకు, తల్లి,తండ్రి తమ కుమార్తె మృతదేహం ఉన్న సూట్‌కేస్‌ను యమునా ఎక్స్‌ప్రెస్ వే పక్క ఉన్న వ్యవసాయ పరిశోధనా కేంద్రం సమీపంలోని పొదల్లో పడేశారు. ఈ ఘటనలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
14 బృందాలు
పోలీసులు 14 బృందాలను ఏర్పాటు చేశారు. రెండు తర్వాత హత్య కేసును ఛేదించారు. ఆయుషి మృతదేహాన్ని గుర్తించడానికి తల్లి, సోదరుడిని మధురకు తీసుకువచ్చారు. మృతదేహాన్ని గుర్తించిన వెంటనే, యూపీ పోలీసులు ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 302 (హత్య) కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.












Click it and Unblock the Notifications