CriMe News: సూట్‌కేస్‍లో మృతదేహ భాగాలు.. దీనికి శ్రద్ధా హత్యతో సంబంధం ఉందా .!
గురువారం మధ్యాహ్నం హర్యానాలోని ఫరీదాబాద్‌లోని అటవీ ప్రాంతంలో సూట్‌కేస్ లో మృతదేహం భాగాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి ఢిల్లీలో హత్యకు గురైన శ్రద్ధా కేసుకు సంబందం ఉందని అనుమానిస్తున్నారు. మృతదేహ అవశేషాలను ప్లాస్టిక్ బ్యాగ్, గోనెలో చుట్టి, సూట్‌కేస్ లో పెట్టారు. సూట్ కేసు దొరిగిన చోట బట్టలు, బెల్ట్ కూడా స్వాధీనం చేసుకున్నారు. వేరే చోట చంపి ఇక్కడి తీసుకొచ్చినట్లు పోలీసులు భావిస్తున్నారు.

మెహ్రౌలీ పోలీసుల బృందం
ఇందుకు ఫరీదాబాద్ పోలీసులు ఢిల్లీ పోలీసులతో మాట్లాడారు. దక్షిణ ఢిల్లీకి చెందిన మెహ్రౌలీ పోలీసుల బృందం శ్రద్ధ హత్య కేసును దర్యాప్తు చేస్తుంది. వీరికి సమాచారం అందడంతో సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తులో చేస్తోంది. సూట్‌కేస్‌లో లభించిన మృతదేహానికి శ్రద్ధా వాకర్ హత్య కేసుతో సంబంధం ఉందని ఢిల్లీ పోలీసు అధికారులు అనుమానిస్తున్నారు.

పురుషుడా లేదా స్త్రీ
సూట్‌కేస్‌లో లభించిన శరీర భాగాలు (మొండెంతో సహా)నెలల కిందవి కనిపిస్తున్నాయని.. అవి పురుషుడా లేదా స్త్రీవేనా అనేది స్పష్టంగా తెలియరాలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించామని, పోస్ట్‌మార్టం నివేదిక వచ్చిన తర్వాత విషయాలు తెలుస్తాయని వారు తెలిపారు.

DNA పరీక్ష
"ఢిల్లీ పోలీసులు DNA పరీక్షకు వెళ్లాలనుకుంటే, నమూనాలను పక్కన పెట్టమని ఫరీదాబాద్ పోలీసు అధికారులు కూడా చెప్పారు" అని అధికారిక వర్గాలు ANIకి తెలిపాయి. శ్రద్ధా వాకర్ హత్య కేసులో నిందితుడు ఆఫ్తాబ్ అమీన్ పూనావాలా ప్రస్తుతం పోలీసు కస్టడీలో ఉన్నాడు
అఫ్తాబ్ తన లివ్ ఇన్ పార్ట్‌నర్ అయిన శ్రద్ధను గొంతుకోసి చంపి, ఆమె శరీరాన్ని 35 ముక్కలుగా నరికి నగరమంతా పడేశాడు.












Click it and Unblock the Notifications