Karnataka News: భార్యను హత్య చేసిన భర్త.. 11 ఏళ్ల తర్వాత వీడిని మర్డర్ మిస్టరీ..
కొన్ని నేరాల్లో నిందితులు దొరకకుండా పోతారు. కొన్నికేసుల్లో కొన్ని సంవత్సరాల తర్వాత నిందితులు దొరుకుతారు.ఇలా ఓ మర్డర్ కేసును పోలీసులు 11 ఏళ్ల తర్వాత ఛేదించారు. కర్ణాటకలో ఓ ఉపాధ్యాయుడు తన భార్యకు యువకుడితో వివాహేతర సంబంధం ఉందని సోదరుడితో కలిసి ఆమెను హత్య చేశాడు. ఈ కేసులో నిందితులను 11 ఏళ్ల తర్వాత పోలీసులు అరెస్ట్ చేశారు. విజయపూర్ జిల్లా వాదావేన్ తాలూకా ముధుదేహాల్‌కు చెందిన హుచ్చప్ప ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. అతనికి ప్రియాంకతో వివాహం అయింది. కొద్ది రోజుల తర్వాత ప్రియాంక ఓ యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది.

హెచ్చరించినా..
విషయం తెలుసుకున్న హుచ్చప్ప భార్యను పలుమార్లు ఎచ్చరించాడు. కానీ ఆమె వివాహేతర సంబంధం కొనసాగించింది. దీంతో హుచ్చప్ప భార్యను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. పథకం ప్రకారం 2011 జూలై 24న దైవదర్శనం కోసం శ్రీశైల పుణ్యక్షేత్రానికి వెళ్తామని తన సోదరుడు, భార్యతో కలిసి బయలుదేరాడు. శ్రీశైలంలో దర్శనం పూర్తి చేసుకున్న వీరు తిరుగు ప్రయాణంలో ఏపీలోని పెద్ద దోర్నాల వద్ద సోదరుడి సహాయంతో ప్రియాంక గొంతు నులిమి చంపాడు.మృతదేహాన్ని రోడ్డు పక్కనే ఉన్నగోతిలో పడేసి కర్ణాటకకు వెళ్లిపోయారు.

హత్య గురించి తెలిసినా..
అయితే ఈ హత్య విషయం మృతురాలి తల్లిదండ్రులకు తెలిసినా పట్టించుకోలేదు. కూతురు ప్రవర్తన తెలిసినవారు ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. మీ భార్య ఏదంటూ చుట్టుపక్కల వారు అడగగా ప్రియాంక ఎవరితోనో వివాహేతర సంబంధం పెట్టుకుని వెళ్లిపోయిందంటూ చెప్పాడు. మృతదేం లభించడంతో విచారణ చేపట్టిన ఏపీ పోలీసులు ఎలాంటి ఆధారం లేకపోయేసారికి కేసును క్లోజ్ చేశారు.
Recommended Video


బంధువులే బయట పెట్టారు..
అయితే హుచ్చప్పకు, అతని బంధువులక ఆస్తి పంపకాల్లో నెలకొన్న విభేదాల కారణంగా ఈ మర్డర్ విషయం బయటకు వచ్చింది. హుచ్చప్ప బంధువులు కర్ణాటకకు చెందిన పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగు చూసింది. విచారణ చేపట్టిన కర్ణాటక పోలీసులు నిందితులు చెప్పిన ఆధారాల మేరకు పెద్దదోర్నాల పోలీసు స్టేషన్‌కు చేరుకుని విచారణం చేపట్టారు.
-
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ












Click it and Unblock the Notifications