Gold Price: బంగారం ఇక కొనలేమా.. రూ.80 వేలకు చేరుతుందా.. నిపుణులు ఏం చెబుతున్నారు..!
బంగారం ధర భారీగా పెరిగిపోతోంది. రికార్డుల మీద రికార్డులు సాధిస్తోంది. ప్రస్తుతం బంగారం రూ.70 వేల మార్క్ ను దాటింది. గత శనివారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.73,100 పలికింది. బంగారం ధర పెరిగినట్లే వెండి ధర కూడా దూసుకెళ్తోంది. వెండి కిలో రూ.
రూ. 80 వేలకు పైనే ఉంది.సోమవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 70,912 ఉంది. ఇది మంగళవారం రూ.190 పెరిగి రూ. 71,102 లకు పెరిగింది.
10గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 65,750 పెరిగింది. అటు అంతర్జాతీయ మార్కెట్ లో కూడా బంగారం ధర భారీగా పెరుగుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ (31.1 గ్రాములు) ధర 27 డాలర్లు పెరిగి 2,372డాలర్లపైకి పెరిగింది. మంగళవారం వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. కిలో వెండి రూ.81,897 వద్ద కొనసాగుతోంది. బంగారం ధర రూపాయి విలువతో పాటు పలు అంశాలపై ఆధారపడి ఉంటాయి. అంతర్జాతీయ పరిణామాలు కూడా బంగారం ధరపై ప్రభావం చూపుతాయి.

యూఎస్ ఫెడ్ ద్వారా ద్రవ్య విధాన సడలింపు, మధ్య ప్రాచ్య ప్రాంతంలో రాజకీయ పరిస్థితి క్షీణించడం కూడా బంగారం ధర పెరగడానికి కారణంగా చెబుతున్నారు. రష్యా ఉక్రెయిన్ మధ్య కొనసాగుతోన్న యుద్ధం, ఇజ్రాయెల్ హమాస్ మధ్య ఉద్రిక్తత కొనసాగుతోన్న నేపథ్యంలో పుత్తడి ధర పెరుగుతోంది. ఏడాదిలో బంగారం ధర 12 శాతం పెరిగిందని నిపుణులు చెబుతున్నారు. మార్చిలో బంగారం ధర 8.38 శాతం పెరిగింది.
మార్చి 1న హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల స్వర్ణం ధర రూ.57,900 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.63,160గా ఉంది. నెల రోజుల్లో పుత్తడి ధర భారీగా పెరిగింది. ప్రస్తుతం భారీగా పెరిగిన బంగారం ధర రెండు,మూడు నెలల్లో తగ్గే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.












Click it and Unblock the Notifications