ఆలులేదు సూలులేదు కొడుకు పేరు సోమలింగం అనట్లు, సీఎం సీటు కోసం పోటీ !
బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కు కొన్ని గంటలు మాత్రమే సమయం ఉంది. ఏ పార్టీకి సంపూర్ణ మెజారిటీ రాదని ఇప్పటికే సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. అయితే కాంగ్రెస్ పార్టీ అత్యధిక సీట్లు కైవసం చేసుకుంటుందని సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి. ఈ సందర్బంలో కాంగ్రెస్ పార్టీ నుంచి సీఎం రేసులో నిలబడుతున్న నాయకుల క్యూ పెరిగిపోతుంది.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కోవడంలో మొదటి నుంచి మాజీ సీఎం సిద్దరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డీకే. శివకుమార్ ఉన్నారు. సిద్దరామయ్య, డీకే శివకుమార్ దాదాపు అన్ని నియోజక వర్గాల్లో ఎమ్మెల్యే టిక్కెట్లు ఇచ్చారు. అయితే కొన్ని సీట్లకు మాత్రం ఢిల్లీలో డీల్ జరిగింది అని కాంగ్రెస్ పార్టీ నాయకులే అంటున్నారు.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ తరువాత కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వం ఏర్పాటు చెయ్యడానికి సంపూర్ణ మెజారిటీ వస్తే సీఎం రేసులో సిద్దరామయ్య, డీకే శివకుమార్ ఉన్నారు. ఈ ఇద్దరు నాయకుల మధ్యనే సీఎం సీటుకోసం మొదటి నుంచి పోటీ ఉందని కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు. అయితే సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ తరువాత సీఎం కుర్చీ కోసం చాలా మంది పోటీ చేస్తున్నారు.
ఇదే సమయంలో ఏఐసీసీ అధ్యక్షుడు, కేంద్ర మాజీ మంత్రి మల్లికార్జున ఖార్గే పేరు కూడా తెరమీదకు వచ్చింది. దళితుడిని సీఎం చేస్తే కాంగ్రెస్ పార్టీకి ఇంకా మంచి పేరు వస్తుందని కొందరు నాయకులు కొత్తగా తెరమీద ఓ డిమాండ్ తెచ్చారు. అసెంబ్లీ ఎన్నికలు పూర్తి అయిన తరువాత ఎమ్మెల్యేగా పోటీ చేసిన మల్లికార్జున ఖార్గే కుమారుడు. కర్ణాటక మాజీ మంత్రి ప్రియాంక ఖార్గే పేరు కూడా తెరమీదకు వచ్చింది.
ఇప్పటికే ప్రియాంక ఖార్గే కాబోయే సీఎం అంటూ బ్యానర్లు ఏర్పాటు చెయ్యడం కలకలం రేపింది. యువకుడైన ప్రియాంక ఖార్గేకి సీఎం పదవి ఇవ్వాలని ఆయన అభిమానులు వందల సంఖ్యలో ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. ఏఐసీసీ అధ్యక్ష పదవిలో ఉన్న మల్లికార్జున్ ఖార్గేతో పాటు ఆయన కుమారుడు ప్రియాంక ఖార్గే కూడా సీఎం రేసులో ఉండటం హాట్ టాపిక్ అయ్యింది.

దళితులను సీఎం చెయ్యాల్సి వస్తే కేంద్ర మాజీ మంత్రి కేహెచ్. మునియప్ప, కర్ణాటక మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ జీ. పరమేశ్వర్ కూడా సీఎం రేసులో ఉన్నారు. లింగాయత్ లను సీఎం చెయ్యాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు. మాజీ మంత్రి ఎంబీ పాటిల్ కూడా డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో మచ్చలేని నాయకుడు, సీనియర్ నేత ఆర్ వీ. దేశ్ పాండే పేరు కూడా సీఎం రేసులో ఉందని వెలుగు చూసింది.
ఇక వరుస విజయాలతో దూసుకుపోతూ చాలా సౌమ్యుడిగా పేరు తెచ్చుకున్న బెంగళూరులోని బీటీఎం లేఔట్ ఎమ్మెల్యే రామలింగా రెడ్డి పేరు కూడా సీఎం రేసులో ఉంది. అదే విదంగా బెంగళూరులోని బ్యారాయణపుర ఎమ్మెల్యే, రాహుల్ గాంధీకి సన్నిహితుడు అయిన క్రిష్ణబైరేగౌడ, బెంగళూరులోని గాంధీనగర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి దినేష్ గుండురావ్ పేరు కూడా సీఎం రేసులో ఉంది. మహిళలకు అవకాశం ఇస్తే కర్ణాటక కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ లక్ష్మీ హెబ్బాళ్కర్ పేరు కూడా సీఎం రేసులో ఉంది.
అయితే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది ? అనే విషయం వేచి చూడాలి. అయితే కర్ణాటక సీఎం రేసులో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ తో నిత్యం టచ్ లో ఉండే మాజీ సీఎం సిద్దరామయ్య, దేనికైనా తెగించి పని చేసే డీకే శివకుమార్ మధ్యనే గట్టిపోటీ ఉందని, ఇద్దరిలో ఎవరికి సీఎం పదవి ఇచ్చినా సమస్యలు వస్తాయని అనుకుంటే మూడో వ్యక్తి తెరమీదకు వచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు అంటున్నాయి.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications