జయలలితకు ఊరట: బెయిల్ గడువు పొడగింపు
న్యూఢిల్లీ: అక్రమాస్తుల కేసులో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కుమారి జయలలిత బెయిల్‌ను మే 12వ తేదీ వరకు పొడగిస్తూ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అక్రమాస్తుల కేసులో అరెస్టు అయిన జయలలిత కు ఇంతకు ముందు బెయిల్ లభించింది. ఆ బెయిల్ గడువు శుక్రవారంతో ముగిసింది.
తనకు బెయిల్‌ను పొడిగించాలని కోరుతూ జయలలిత సుప్రీం కోర్టులో అర్జీ సమర్పించుకున్నారు. శుక్రవారం న్యాయమూర్తి హెచ్.ఎల్. దత్తు అర్జీ విచారణ చేశారు. తరువాత వివరాలు తెలుసుకున్న న్యాయమూర్తి జయలలిత బెయిల్ గడువును పొడగించారు.

2014 డిసెంబర్ 18వ తేదీన జయలలిత బెయిల్‌ను నాలుగు నెలల పాటు పొడగించారు. సుప్రీం కోర్టు ఇచ్చిన నాలుగు నెలల బెయిల్ గడువు ముగిసిపోవడంతో ఆమె మళ్లీ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
అక్రమ ఆస్తులు సంపాదించారని రుజువు కావడంతో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితను అప్పట్లో బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలుకు తరలించారు. జైలులో ఉన్న జయలలిత తదితరులు తరువాత సుప్రీం కోర్టులో బెయిల్ తీసుకున్నారు.












Click it and Unblock the Notifications