student: ఎస్ఐ కొడుకు ఎంబీఏ స్టూడెంట్, పోలీసు క్వాటర్స్ లో ఏకంగా, సీసీటీవీల్లో ?

చెన్నై: పోలీస్ క్వార్టర్స్‌లోకి దొంగలు ప్రవేశించాలంటే అంత సులభం కాదు. నిత్యం పోలీసులతో ఆ క్వాటర్స్ కిటకిటలాడుతుంటుంది. డే డ్యూటీలు, నైట్ డ్యూటీలు చేస్తున్న పోలీసులు వారు నివాసం ఉంటున్న పోలీసు క్వాటర్స్ లోకి ఏదో ఒక సమయంలో వెళ్లి వస్తుంటారు. ఇలాంటి పోలీసు క్వాటర్స్ లోని గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్‌లో తెరిచి ఉన్న ఐదు ఇళ్లల్లో దొంగలుపడ్డారు. మరుసటి రోజు పోలీస్ క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్న ఆ ఐదు కుటుంబాల పోలీసులు మా ఇళ్లలో నగలు, సెల్‌ఫోన్లు, డబ్బు చోరీకి గురయ్యాయని ఫిర్యాదు చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. పోలీసుల విచారణలో దిమ్మతిరిగిపోయే సమాచారం బయటకు వచ్చింది.

 పోలీసు క్వాటర్స్

పోలీసు క్వాటర్స్

చెన్నైలోని పుదుప్పేట్ లోని పోలీసు క్వాటర్స్ లో ఒకే రోజు రాత్రి వరుసగా చోరీలు జరిగాయి. పోలీస్ క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్న ఆ ఐదు కుటుంబాల పోలీసులు మా ఇళ్లలో నగలు, సెల్‌ఫోన్లు, డబ్బు చోరీకి గురయ్యాయని ఎగ్మూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఐదు మంది పోలీసుల ఇళ్లల్లో మొత్తం 16 సవర్ల బంగారు నగలు, రూ. 34 వేలు, 3 సెల్ ఫోన్లు చోరీకి గురైనాయని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

 సీసీటీవీ కెమెరాల్లో ?

సీసీటీవీ కెమెరాల్లో ?

ఎగ్మూరు పోలీసులు పోలీసు క్వాటర్స్ కు వెళ్లి విచారణ ప్రారంభించారు. అలాగే ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ ఫుటేజీలను స్వాధీనం చేసుకుని పరిశీలించారు. పోలీసు క్వాటర్స్ లోకి బయటి వ్యక్తులు ఎవ్వరూ ప్రవేశించలేదని, చోరీకి పాల్పడలేదని పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది. ఇంటి దొంగలు ఎవరు అని పోలీసులు ఆరా తీశారు.

 ఎస్ఐ కొడుకు మాయం

ఎస్ఐ కొడుకు మాయం

ఈ కేసులో ఎగ్మూర్ పోలీసులు అనుమానాస్పదంగా ఉన్న పోలీస్ క్వార్టర్స్‌లోని కొంత మందిని విచారించారు. దోపిడీ జరిగిన రోజు తెల్లవారుజామున ఎగ్మోర్ సాయుధ దళాలలో పనిచేస్తున్న అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ కుమారుడు కనిపించకుండా పోయాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. కనిపించకుండాపోయిన యువకుడు అతని స్నేహితుడితో కలిసి చిందతిరిపేట ప్రాంతంలో ఉన్నాడని తెలుసుకున్న ఎగ్మూర్ పోలీసులు అక్కడికి వెళ్లి ఇద్దరిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు పిలుచుకుని వెళ్లారు.

 ఫ్రెండ్ తో కలిసి ?

ఫ్రెండ్ తో కలిసి ?

పోలీసుల విచారణలో 5 ఇళ్లలో చొరబడి దొంగతనం చేసినట్లు ఇద్దరు యువకులు అంగీకరించారని పోలీసులు అన్నారు. పోలీసు క్వాటర్స్ లో చోరీకి పాల్పడింది ఎగ్మోర్ సాయుధ బలగాల పోలీస్ అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ (ఎస్ఐ) కుమారుడు నందగోపాల్ (23), చెన్నైలోని పుదుపేటకు చెందిన నందకుమార్ స్నేహితుడు అరుణ్ (20) అని పోలీసు అధికారుల విచారణలో వెలుగు చూసింది. చెన్నైలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఎంబీఏ చదువుతున్న ఎస్ఐ కుమారుడు నందగోపాల్ డ్రగ్స్‌కు బానిస అయ్యాడని, అతని ఖర్చుల కోసం స్నేహితుడితో కలిసి పోలీస్ క్వార్టర్స్‌లో చోరీకి పాల్పడ్డాడని పోలీసు అధికారుల విచారణలో తేలింది.

 గతంలో క్షమించి వదిలేసినా ఇప్పుడు మాత్రం ?

గతంలో క్షమించి వదిలేసినా ఇప్పుడు మాత్రం ?

గతంలో పోలీసు క్వాటర్స్ లో కొత్తగా అపార్ట్‌మెంట్‌లో నిర్మించిన సమయంలో పోలీస్‌ క్వాటర్స్ భవనానికి ఉపయోగించే ఇనుప సామాగ్రిని దొంగిలించి షాపులో విక్రయిస్తుండగా పలుమార్లు నందకుమార్ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడని పోలీసుల విచారణలో వెల్లడైంది. పోలీసు కుటుంబానికి చెందిన నందకుమార్ ను అతని తండ్రి ముఖం చూసి ఆ కాంట్రాక్టర్ పోలీసు స్టేషన్‌ లో కేసు పెట్టకుండా వదిలేశారని పోలీసులు అన్నారు. నందగోపాల్‌, అతని స్నేహితుడు అరుణ్‌ నుంచి చోరీకి గురైన 16 సవర్ల బంగారు నగలు, రూ.30 వేల నగదు, మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకుని ఇద్దరినీ జైలుకు పంపించామని ఎగ్మూర్ పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+