సిద్దూ, డీకే స్కెచ్, 12 మంది ఎమ్మెల్యేలు ?, పార్టీకే ఏసరు పెడుతున్న మాజీ శిష్యుడు !
బెంగళూరు: లోక్‌సభ ఎన్నికలు 2024ను దృష్టిలో ఉంచుకుని కర్ణాటకలో భారీ స్కెచ్ వెయ్యాలని కాంగ్రెస్ పార్టీ యోచిస్తోంది. జేడీఎస్ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ నాయకులు టచ్‌లో ఉన్నట్లు సమాచారం. జేడీఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడానికి చర్చలు జరుగుతున్నాయని టీవీ 9 కన్నడ న్యూస్ చానల్ సంచలన కథనం ప్రసారం చేసింది.
పాత మైసూర్‌లో ఓట్లను మరింత సమీకరించుకోవడమే లక్ష్యంగా జేడీఎస్ కు చెందిన చాలా మంది ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ టచ్‌లో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే రెండు దఫాలుగా సమావేశాలు జరిగాయని, హైకమాండ్ ఆమోదం తర్వాత తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. పాత మైసూరుకు చెందిన జేడీఎస్ సీనియర్ ఎమ్మెల్యే ఒకరు కాంగ్రెస్ నేతలతో నిత్యం టచ్‌లో ఉన్నట్లు సమాచారం.

అంతా అనుకున్నట్లు జరిగితే పెద్దఎత్తున జేడీఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరడం ఖాయమని చెబుతున్నారు. అనర్హత వేటు పడకుండా, ఉపఎన్నికలు రాకుండా ఉండేందుకు కాంగ్రెస్ 2/3వ వంతు కంటే ఎక్కువ మంది జేడీఎస్ ఎమ్మెల్యేలను సంప్రదించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 12 మందికి పైగా ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరితే జేడీఎస్ పార్టీ చట్టపరంగా ఏమి చెయ్యలేదని, తరువాత కాంగ్రెస్‌లో విలీనమవుతుంది. పార్టీలను విలీనం చేసుకునే అధికారం ఎమ్మెల్యేలకు లభిస్తుందని తెలిసింది.
కాంగ్రెస్ నేతలు తమ వ్యూహాలను చాలా జాగ్రత్తగా ప్రయోగిస్తున్నారు. దీనిపై తుది నిర్ణయం తీసుకునే ముందు ఎవరితోనూ వెల్లడించవద్దని, ఎవరితోనూ చర్చించవద్దని జేడీఎస్ ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నాయకులు సూచించినట్లు సమాచారం. దీనిపై మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి మాట్లాడుతూ జేడీఎస్ నేతలు ఎవరూ కాంగ్రెస్‌లో చేరబోరని ధీమా వ్యక్తం చేశారు.

బీజేపీ, జేడీఎస్ కార్యకర్తలను కాంగ్రెస్ బెదిరిస్తోంది. నేతలను ఎంకరేజ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. నాకు తెలిసి జేడీఎస్ నుంచి ఏ ఎమ్మెల్యే కూడా మా పార్టీని వీడరు. తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు కాంగ్రెస్ ఇలాంటి కథలు చెబుతోందని మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామి అన్నారు.
సిద్ధరామయ్య ప్రభుత్వ వైఫల్యంతో దాదాపు 20 నుంచి 30 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారని, ఆ విషయం అందరికి తెలుసని కుమారస్వామి అన్నారు. ఆ విషయం దాచిపెట్టేందుకే ఇలాంటి విషయాలను తెరపైకి తెచ్చారని మాజీ సీఎం కుమారస్వామి అన్నారు. ఇన్ని పరిణామాల మధ్య బెంగళూరులోని యశవంతపురం బీజేపీ ఎమ్మెల్యే ఎస్ టీ సోమశేఖర్ కాంగ్రెస్‌లో చేరనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.

ఇప్పటికే యశవంతపురం నియోజకవర్గం జేడీఎస్ పార్టీ కార్యకర్తలతో మాజీ సీఎం కుమారస్వామి సమావేశం నిర్వహించి ఉప ఎన్నికలకు సిద్ధం కావాలని సూచించినట్లు సమాచారం. కేఆర్‌పురం ఎమ్మెల్యే బైరతి బసవరాజ్, యల్లాపూర్ ఎమ్మెల్యే శివరామ్ హెబ్బర్, కొప్పల్ ఎంపీ సంగన్న, బీజేపీ మాజీ ఎమ్మెల్యే శంకర్ పాటిల మనేనకొప్ప, బీజేపీ మాజీ ఎమ్మెల్సీ ఆయనూరు మంజునాథ్ సహా పలువురికి కాంగ్రెస్ పార్టీ గాలం వెయ్యాలని ప్రయత్నిస్తున్నదని తెలిసింది.












Click it and Unblock the Notifications