Bengaluru: కోటీశ్వరులు, తండ్రి హత్యకు కోట్లలో డీల్ చేసిన కొడుకు, చంపేశారు, కానీ ?
బెంగళూరు/మారతహళ్లి: తండ్రి కొడుకుల అనుభందం అంటే కొత్తగా చెప్పనవసరం లేదు. కొడుకు పుట్టాలంటే అందుకు కారణం తండ్రి. ఏ మతం అయినా, కులం అయినా తండ్రి కారణంగానే కొడుకు పుడుతాడు. కొందరు వ్యక్తులు పట్టపగలు తండ్రిని నరికి చంపుతున్న సమయంలోనే అతని కొడుకు అదే ప్రాంతంలో ఉన్నాడు. ఆ సమయంలో తండ్రిని రక్షించడానికి కొడుకు ప్రయత్నించాడు. అయితే తండ్రి ప్రాణాలు మాత్రం గాలిలో కలిసిపోయాయి. పోలీసుల విచారణలో దిమ్మతిరిగిపోయే సమాచారం వెలుగు చూసింది. తండ్రి హత్యకు అతని కొడుకు కోటి రూపాయలు- కిరాయి హంతకులకు బంపర్ ఆఫర్లు ఇచ్చాడని వెలుగు చూడటం కలకలం రేపింది.

బెంగళూరులో కోటీశ్వరుడు
బెంగళూరు నగరంలోని మారతహళ్లిలోని సమీపంలోని పణత్తూరులో నారాయణస్వామి ఆనే ఆయన నివాసం ఉంటున్నారు. నారాయణస్వామికి మణికంఠ అనే కుమారుడు ఉన్నాడు. నారాయణస్వామి అతని కుమారుడు మణికంఠకు 12 సంవత్సరాల క్రితం ఓ యువతితో వివాహం జరిపించాడు. కొన్ని సంవత్సరాలు భార్యతో కాపురం చేసిన మణికంఠ 2013లో అతని భార్యను గొంతు నులిమి హత్య చేశాడు. ఈ కేసు ఇంకా విచారణలోనే ఉంది. మణికంఠకు ఓ కుమార్తె కూడా ఉంది.

కొడుక్కి రెండో పెళ్లి
కొడుకు మణికంఠ అతని భార్యను హత్య చెయ్యడంతో పోలీసు కేసులు, రాజీ పంచాయితీలతో నారాయణస్వామి ఆ కేసు క్లోజ్ చేయించాడు. తరువాత మణికంఘ రెండో పెళ్లి చేసుకున్నాడు. రెండో భార్యతో కొంతకాలం కాపురం చేసిన మణికంఠ ఆమెకు టార్చర్ పెట్టాడు. రెండో భార్య కూడా పుట్టింటికి వెళ్లిపోవడంతో మణికంఠ వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఆమె కూడా మణికంఘ టార్చర్ తట్టుకోలేక వెళ్లిపోయింది.

కొడుకు ముందే తండ్రి దారుణ హత్య
ఈనెల 13వ తేదీన ఉదయం 11 గంటల సమయంలో ఓఇంటి సైట్ రిజిస్ట్రేషన్ చెయ్యించడానిక నారాయణస్వామి సబ్ రిజిస్టర్ కార్యాలయానికి వెళ్లారు. ఆ సందర్బంలో సబ్ రిజిస్టర్ కార్యాలయం సమీపంలోని కారు పార్కింగ్ స్తలంలో కారు నిలిపి వెలుతున్న నారాయణస్వామిని కొందరు వ్యక్తులు దారుణంగా నరికేశారు. ఆ సమయంలో నారాయణస్వామి పక్కలో అతని కొడుకు మణికంఠ కూడా ఉన్నాడు. తండ్రిని రక్షించడానికి మణికంఠ నాటకాలు ఆడాడు. అయితే నారాయణస్వామి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.

ఎన్ని కోట్లు ఆస్తి అంటే ?
నారాయణస్వామి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ కోట్లలో డబ్బలు సంపాధించాడు. కొడుకు మణికంఠ అతని భార్యను హత్య చేసి జైలుకు వెళ్లిన తరువాత ఆస్తి మొత్తం మనుమరాలి పేరుమీద రాసేశాడు. జైలు నుంచి విడుదలైన మణికంఠకు తన తండ్రి తన మొదటి భార్య కూతురి పేరు మీద ఆస్తి రాసేశాడని తెలుసుకున్నాడు. తండ్రితో రాజీ పంచాయితీలు చేసి ఆస్తిలో భాగం తీసుకోవాలని మణికంఠ అనేక ప్రయత్నాలు చేశాడు. అయితే అది సాధ్యం కాలేదు.

తండ్రి హత్యకు కోటి రూపాయలు క్యాష్
తన తండ్రి నారాయణస్వామిని హత్య చేస్తే ఆస్తి మొత్తం తనకే వస్తుందని మణికంఠ స్కెచ్ వేశాడు. జైల్లో పరిచయం అయిన ఆదర్శ్, శివకుతో మాట్లాడిన మణికంఠ తన తండ్రిని హత్య చేస్తే కోటి రూపాయల క్యాష్ తో పాటు అపార్ట్ మెంట్ లోని ఒక ఫ్లాట్, ఎస్ యూవీ కారు ఇస్తానని డీల్ మాట్లాడాడు. డీల్ ప్రకారం నిందితులకు కొంచెం అడ్వాన్స్ గా డబ్బులు ఇచ్చి ప్లాన్ ప్రకారం తండ్రి నారాయణస్వామిని హత్య చేయించాడు. అయితే సీన్ మొత్తం రివర్స్ కావడంతో మణికంఠతొ పాటు కిరాయి హంతకులు శివ. ఆదర్శ మారతహళ్లి పోలీసులకు చిక్కిపోయారు.












Click it and Unblock the Notifications