అమానుషం : తల్లిని స్తంభానికి కట్టేసి, చితకబాదిన కొడుకు...
అమానుషం : తల్లిని స్తంభానికి కట్టేసి, చితకబాదిన కొడుకు : ఓ యువకుడు కన్నతల్లి పట్ట అమానుషంగా ప్రవర్తించాడు. నవమోసాలు మోసి కన్నతల్లిని కరెంటు పోల్‌కు కట్టేసి అతి క్రూరంగా కొట్టాడు. ఈ దయనీయమైన సంఘటన ఒడిశాలో చోటుచేసుకుంది.
వివరాలు ఇలా ఉన్నాయి. ఒడిశాలోని కియోంఝార్ జిల్లాలోని సరసపాసి గ్రామానికి చెందిన ఓ వృద్ధురాలు ఒంటరిగా ఉంటుంది. కొడుకులు ఉన్న అందరూ వేరువేరుగా ఉంటున్నారు. ఆమెకు 70 సంవత్సరాలు. ఆ వయసులో కొడుకులు, మనవళ్లలతో సరదాగా ఉండాల్సిన ఆమె ఒంటరిగా జీవితం సాగిస్తోంది. అయితే, ఆమె తన చిన్నకుమారుడి పొలంలోకి వెళ్లి క్యాలీఫ్లవర్ల్‌ను తెంపింది. దాంతో కొడుకు కోపోద్రిక్తుడై నా అనుమతి లేకుండా నా పొలంలోని కాయగూరలు తెంపుతావా అంటూ కన్నతల్లి అనే కరికరం కూడా లేకుండా ఆమెపై అమానుషంగా ప్రవర్తించాడు.

ఆమె ప్రభుత్వం ఇచ్చే రేషన్, పెన్షన్‌తో తన ఒంటరి జీవితాన్ని గడుపుతోంది. అయితే, డిసెంబర్ 20వ తేదీ తన కొడుకు పొలంలో ఉన్న క్యాలిఫ్లవర్ పంట చేతికి వచ్చింది. దాంతో ఆ తల్లి చేతి ఖర్చుల కోసం, ఆ పొలంలోని నాలుగు క్యాలిఫ్లవర్లను తెంపి గ్రామంలోని మరొకరికి అమ్మింది. వాటిని అమ్మితే రూ. 80 రూపాయలు వచ్చాయి. ఆ డబ్బుతో నిత్యావసర సరుకులు కొనుగోలు చేసింది. విషయం తెలుసుకున్న కొడుకు తల్లిని తీవ్రంగా కొట్టాడు.ఊర్లోని కరెంట్ స్తంభానికి తల్లిని కట్టేసి, తాడు, కర్రలతో తీవ్రంగా కొట్టాడు. ఈ ఘటనతో చలించిపోయిన స్థానికులు ఆ తల్లిని కాపాడే ప్రయత్నం చేశారు.
కొడుకును అరెస్టు చేసిన పోలీసులు : వృద్ధురాలిని కాపాడబోయిన స్థానికులను కూడా ఆ వ్యక్తి బెదిరించాడు. అయినప్పటికీ స్థానికులు ఆమెను ప్రాణాలతో రక్షించారు. అనంతరం బాధితురాలిని బసుదేవ్‌పూర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో చేర్పించారు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించారు. బాధితురాలి వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్న పోలీసులు, నిందితుడిపై కేసు నమోదు చేశారు. కొడుకును అరెస్టు చేసి జైలుకు తరలించారు. అయితే, ఈసంఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో తెగ వైరల్ అయ్యింది. వృద్దసమయంలో తల్లికి చేదోడు వాదోడుగా ఉండాల్సిన కొడుకులే ఆమెను ఇంటినుంచి గెంటివేయడం కాకుండా, ఇంతటి అమానుష చర్యకు పాల్పడుతారా? అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మానవత్వం కనుమరుగై పోతుంద నడానికి ఇదే నిదర్శనం.












Click it and Unblock the Notifications