betting: ఫ్రెండ్స్ తో ఏం బెట్టింగ్ కట్టాడంటే ?, 10 నిమిసాల్లో మూడు క్వాటర్లు సాధ్యమా ?, భార్య ఎంట్రీతో ?
లక్నో/ఉత్తరప్రదేశ్: కొంతమంది ఆవేశంలో తీసుకున్న నిర్ణయాల వలన ప్రాణం మీదకు తెచ్చుకుంటున్నారు, భార్య, నలుగురు పిల్లలతో కలిసి జీవిస్తున్న వ్యక్తి అదే టైపులో ప్రాణాలు పోగొట్టుకున్నాడు. నేను ఎంతైనా తాగుతా, ఎలాగైనా ఉంటా అంటూ స్నేహితులతో బెట్టుకుని పీకలదాక మద్యం సేవించి పైలోకాలకు వెళ్లిపోయాడు.
ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో జై సింగ్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు జై సింగ్ ఆటో డ్రైవర్, ఇతనికి ముగ్గురు కుమారులు, ఓ కుమార్తె, భార్య ఉననారు. మద్యానికి బానిసైన జై సింగ్ ఫిబ్రవరి 8న తన స్నేహితులు బోలా, కేశవ్‌లతో కలిసి మద్యం తాగేందుకు ఆగ్రా బయటకు వెళ్లాడు. ఆ తరువాత జై సింగ్ రాత్రి ఇంటికి రాకపోవడంతో అతని 16 ఏళ్ల కుమారుడు కరణ్ తన తండ్రి కోసం వెతకడం ప్రారంభించాడు.

తరువాత జై సింగ్ రోడ్డు పక్కన పడి ఉన్నాడని గుర్తించిన అతని కొడుకు షాక్ అయ్యాడు. వెంటనే తండ్రి జైసింగ్ ను రక్షించిన కుటుంబ సభ్యులు అతన్ని ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే జై సింగ్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అలాగే జై సింగ్ తన ఆటో అప్పు చెల్లించేందుకు రూ. 60 వేలు వాయిదా కట్టాలని తీసుకెళ్లిన డబ్బు కూడా మాయం కావడంతో అతని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు.
జై సింగ్ సోదరుడు సుఖ్‌బీర్ సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. జై సింగ్‌తో కలిసి మద్యం సేవించిన స్నేహితులు భోలా, కేశవ్‌లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. అప్పుడు షాకింగ్ నిజం బయటపడింది. జై సింగ్ తన స్నేహితులతో కలిసి పందెం కాసి మద్యం సేవించాడు. నేను 10 నిమిషాల్లో 3 క్వార్టర్ల మద్యం తాగుతానని, నేను గెలిస్తే నువ్వు బిల్లు చెల్లించాలని, లేదంటే నేను మీ బిల్లు చెల్లిస్తానంటూ ఇద్దరు స్నేహితుల వద్ద పందెం కాసి మూడు సీసాలు కొని విపరీతంగా తాగాడు.
తక్కువ కాలంలోనే అతిగా మద్యం సేవించడంతో జైసింగ్ ప్రాణం పోయిందని పోలీులు అన్నారు. వెంటనే అతని స్నేహితులు ఇద్దరూ రూ. 60 వేలు డబ్బులు తీసుకుని అక్కడి నుంచి పరారయ్యారు. జై సింగ్ అనుమానాస్పద మరణం కేసుకు సంబంధించి అతని స్నేహితులు బోలా, కేశవ్‌లను పోలీసులు అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications