సుప్రీం కోర్టులో హార్దిక్ పటేల్ కు చుక్కెదురు
న్యూఢిల్లీ: పటేళ్ల రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తున్న ఆ వర్గం యువకెరటం హార్దిక్ పటేల్ కు సుప్రీం కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తన మీద నమోదు అయిన కేసు కొట్టి వెయ్యాలని హార్దిక్ పటేల్ పెట్టుకున్న పిటీషన్ ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. 2016 జనవరి 5 లోపు దర్యాప్తు చేసి చార్జీషీటు వెయ్యాలని సుప్రీం కోర్టు సూచించింది.
జనవరి 5వ తేది వరకు హార్దిక్ పటేల్ కు రిమాండ్ విధించింది. భారత్- దక్షిణాఫ్రికా జట్ల మద్య జరిగిన వన్డే మ్యాచ్ సందర్బంగా చేపట్టిన నిరసన కార్యక్రమంలో హార్దిక్ పటేల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. రిజర్వేషన్ల కోసం ఎవ్వరూ ఆత్మహత్యలు చేసుకోరాదని, అవసరం అయితే పోలీసులను చంపాలని పిలుపునిచ్చాడు.

సూరత్ పోలీసులు హార్దిక్ పటేల్ మీద దేశద్రోహం కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. తన మీద నమోదు అయిన కేసు కొట్టి వెయ్యాలని హార్దిక్ పటేల్ గుజరాత్ హై కోర్టును ఆశ్రయించారు. ఎఫ్ఐఆర్ సక్రమంగా ఉందని, సాక్షాలు ఉన్నాయని గుజరాత్ హైకోర్టు చెప్పింది.
ఇప్పుడు తాము ఈ కేసు కొట్టి వెయ్యాలని సూచించలేమని, దర్యాప్తు జరగాలని ఆదేశాలు జారీ చేసిన గుజరాత్ హై కోర్టు హార్దిక్ పటేల్ వేసిన పిటీషన్ ను కొట్టి వేసింది. తరువాత హార్దిక్ పటేల్ సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. సుప్రీం కోర్టులో ఆయనకు చుక్కెదురు అయ్యింది. ఇప్పటికి హార్దిక్ పటేల్ గుజరాత్ పోలీసుల కస్టడిలో ఉన్నారు.












Click it and Unblock the Notifications