దొంగ చేతిలో పోలీసు దారుణ హత్య, సినిమా చూశారు కానీ ఎవ్వరూ ?, సీసీటీవీల్లో, రూ. 1 కోటి ఇచ్చిన సీఎం !
న్యూఢిల్లీ/బెంగళూరు: ఓ మహిళ పోలీసులకు ఫోన్ చేసి తన భర్త మొబైల్ ఫోన్ ఓ యువకుడు ఎత్తుకుని వెలుతున్నాడని పోలీసు కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేసింది. పోలీసు సంఘటనా స్థలానికి వెళ్లారు. అక్కడ ఓ యువకుడి దగ్గర బాధితురాలు ఫోన్ చేసిన వ్వక్తి భర్త మొబైల్ ను గుర్తించిన పోలీసు అతన్ని అదుపులోకి తీసుకున్నాడు. దొంగను పట్టుకుని వెలుతున్న పోలీసుకు తన ప్రాణం పోతుందని ఊహించలేకపోయాడు. నిందితుడిని పట్టుకుని వెలుతున్న సమయంలో అదే నిందితుడు కత్తి తీసుకుని పోలీసును ఇస్టం వచ్చినట్లు పొడిచేశాడు. తీవ్రకత్తిపోట్లకు గురైన పోలీసు నిందితుడిని పట్టుకోవడానికి అనేక ప్రయత్నాలు చేశాడు. నిందితుడు తప్పించుకోవడం, తరువాత పోలీసు ప్రాణాలు గాలిలో కలిసిపోవడం జరిగింది.

పోలీస్ కంట్రోల్ రూమ్
కానీస్టేబుల్ ను హత్య చేస్తున్న సమయంలో చుట్టుపక్కల చాలా మంది ఉన్నా ఎవ్వరూ కూడా నిందితుడిని పట్టుకోవాలని ప్రయత్నించలేదని, కనీసం కానీస్టేబుల్ ను కాపాడటానికి ప్రయత్నించలేదని పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీటీవీల్లో స్పష్టంగా రికార్డు అయ్యింది. నిందితుడి చేతిలో హత్యకు గురైన కానీస్టేబుల్ కు రూ. 1 కోటి రూపాయలు పరిహారం అందిస్తున్నామని స్వయంగా సీఎం ప్రకటించారు. దేశరాజధాని ఢిల్లీలోని మాయాపురిలోని స్లమ్ ప్రాంతంలో నివాసం ఉంటున్న ఓ మహిళ పోలీసు కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేసింది.

పరుగు తీసిన పోలీసు
విషయం తెలుసుకున్న శంభు దయాల్ (57) అనే కానీస్టేబుల్ సంఘటనా స్థలానికి పరుగు తీశాడు, ఫోన్ చేసిన మహిళ అనీష్ రాజ్ అనే వ్యక్తిని చూపిస్తూ ఇతనే మొబైల్ చోరీ చేశాడని చెప్పింది. పోలీసు శంభుదయాల్ వెంటనే మనీష్ రాజ్ ను అదుపులోకి తీసుకుని అతన్ని పోలీస్ స్టేషన్ కు పిలుచుకుని వెళ్లడానికి ప్రయత్నించాడు. ఆ సందర్బంలో మనీష్ రాజ్ అతని జోబులో ఉన్న కత్తి తీసుకుని కానీస్టేబుల్ శంభు దయాల్ ను ఇస్టం వచ్చినట్లు కత్తితో పొడిచేశాడు. శంభు దయాల్ మీద 12 చోట్ల కత్తిపోట్లు పడ్డాయి.

పోరాడి ప్రాణం వదిలేసిన పోలీసు
కిందకుప్పకూలిపోయిన కానీస్టేబుల్ శంభు దయాల్ నిందితుడు మనీష్ రాజ్ ను పట్టుకోవడానికి ప్రయత్నించి సాధ్యం కాకపోవడంతో పడిపోయాడు. వెంటనే కానీస్టేబుల్ శంభు దయాల్ ను ఆసుపత్రికి తరలించారు. నాలుగు రోజుల పాటు చికిత్స పొందిన కానీస్టేబుల్ శంభుదయాల్ చికిత్స విఫలమై చనిపోయాడు.

సీసీటీవీ కెమెరాల్లో ?
కానీస్టేబుల్ శంభుదయాల్ ను నిందితుడు మనీష్ రాజ్ కత్తితో పొడుస్తున్న సమయంలో పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీటీవీల్లో రికార్డు అయ్యింది. అయితే అందరూ సినిమా చూస్తున్నారో తప్పా ఎవ్వరూ కానీస్టేబుల్ శంభు దయాల్ ను రక్షించడానికి ప్రయత్నించలేదని, కనీసం కానీస్టేబుల్ ప్రాణం కాపాడటానికి ప్రయత్నించలేదని వెలుగు చూసింది.

రూ. 1 కోటి పరిహారం ఇచ్చిన సీఎం
దొంగ చేతిలో హత్యకు గురైన శంభు దయాల్ కు ఓ కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. శంభు దయాల్ కుటుంబానికి రూ. 1 కోటి రూపాయలు పరిహారం అందిస్తున్నామని, ఆయన విధుల్లో అమరవీరుడు అయ్యారని, ఆయన కుటుంబ సభ్యులను ఆదుకుంటామని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ట్విట్ చేశారు.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications